Friday, May 3, 2024

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి: పినరయి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేయాలని కేరళ సిఎం పినరయి విజయన్ తెలిపారు. డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా తిరువనంతపురంలో రైతు ఆందోళనలో పినరయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రోజు రోజుకు రైతుల ఆందోళనలకు మద్ధతు పెరుగుతోందన్నారు. దేశంలో ఆహార భద్రత సమస్య వస్తే అది కేరళపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. రైతుల ఆందోళన 28వ రోజుకు చేరుకుందని అన్నదాతను మోడీ ప్రభుత్వం గౌరవించడంలేదని మండిపడ్డారు. రైతుల ఆందోళన దేశంలో అతి పెద్ద నిరసన అని అన్నారు. గతంలో స్వామి నాథన్ కమిషన్ ఆధారంగా వ్యవసాయ బిల్లులు ప్రవేశపెడుతామని చెప్పి రైతులకు వ్యతిరేకంగా బిల్లు తెచ్చారని మోడీ ప్రభుత్వం పినరయి మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News