Sunday, April 28, 2024

బిసి విద్యార్థుల కోసం కొత్త పథకం..

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం బిసి విద్యార్థుల కోసం మరో కొత్త పథకాన్ని అమలు చేసేందుకు శ్రీకారం చుట్టనుందని, దేశంలోని ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో చదివే పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు కూడా ఫీజు చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫ రాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బుధవారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ ప్రీమెట్రిక్ హాస్టళ్ విద్యార్థుల మాదిరే రాష్ట్రంలోని బిసి పోస్ట్ మెట్రిక్ హాస్టళ్ల విద్యార్థులకు సైతం సంపూర్ణ వసతులు కల్పిస్తున్నామన్నారు. బిసి విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన స్కింలు ఒకే గొడుగు క్రిందకు తీసుకు రావడానికి కొత్త పథకం పేరును తీసుకురావడం జరుగుతందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో బిసి విద్యా సంబందిత అంశాలైన జాతీయ సంస్థల్లో బిసి రియంబర్స్‌మెంట్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్ విద్యార్థులకు సకల వసతులు వంటి నూతన కార్యక్రమాలకు సంబందించి జీవో విడుదల, కొత్త పథకం పేరు, నూతన లోగో విడుదలను ఈ నెల 28 శుక్రవారం హైదరాబాద్‌లో తనతో పాటు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్ తో పాటు బిసి సంఘం నేతలు ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇతర నేతల సమక్షంలో విడుదల చేస్తామని మంత్రి గంగుల తెలిపారు. విద్యనే అన్నింటికి మూలమని, సామాజిక సమానత్వం విద్యతోనే సాద్యమనే గొప్ప నిర్ణయంతో ముఖ్యమంత్రి బిసిలకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ బిసి బిడ్డలకు జాతీయ స్థాయిలోని నేషనల్ ఇన్ట్సిట్యూషనల్ ర్యాంకింగ్ ప్రేమ్ వర్క్ లోని ప్రతిష్టాత్మక ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ తదితర 200కు పైగా విద్యాసంస్థల్లో బిసి విద్యార్థులకు పీజు రియంబర్స్‌మెంట్ అందజేసే పథకాన్ని కూడ అమలు చేయడం జరిగిందని తెలిపారు.

వెనుకబడిన వర్గాల పోస్ట్ మెట్రిక్ హాస్టళ్ల విద్యార్థులకు తీపికబురు కేసీఆర్ సర్కార్ అందిస్తుందన్నారు. రాష్ట్రంలోని 302 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలోని 34వేలకు పైగా బిసి విద్యార్థులకు ఈ సంవత్సరం నుండి బోజన, వసతితో పాటు పూర్తి స్థాయిలో కాస్మెటిక్ చార్జీలు, వులన్ బ్లాంకెట్స్, బెడ్ షీట్స్, కార్పెట్స్, నోట్ బుక్స్ తదితర సౌకర్యాలను కల్పిస్తున్నా మన్నారు. గతంలో బోజన, వసతి మాత్రమే అందజేసేవాళ్లమని, నేటి నిర్ణయంతో విద్యార్థులు మరింత ఉత్సాహంతో విద్యను అభ్యసించి రాష్ట్రం పేరును నిలబెడతారని ఆశాభావం వ్యక్తం చేసారు. ఇప్పటికే బిసి గురుకులాల విద్యార్థులు రాష్ట్రం పేరును జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా నిలుపుతున్నారని, రాష్ట్ర, అంతర్జాతీయంతో పాటు జాతీయ స్థాయిలోని ప్రతిష్టాత్మక సంస్థల్లో చేరే బిసి విద్యార్థులకు పీజు రియంబర్మెంట్‌ను కూడా ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ఇలాంటి అవకాశాలు కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని మంత్రి తెలిపారు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకాలైన రైతుబందు, ఆసరా పించన్లు, 24గంటల ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మీ వంటి పథకాల్లో మెజార్టీ వాటా అందజేయడంతో పాటు, కోకాపేట, ఉప్పల్ బగాయత్ లాంటి ఖరీదైన ప్రాంతాల్లో వేలకోట్ల విలువ గల స్థలాల్లో 42కులసంఘాలకు ఆత్మగౌరవ భవనాలు, గ్రామాల్లో కమ్యూనిటీ హాల్లు, కులవ్రుత్తుల పునర్వైబవానికి ఆర్థిక సాయం, గతంలో కేవలం 19 గురుకులాల నుండి 327 గురుకులాలకు పెంచి 152 పదోతరగతి వరకూ, 142 ఇంటర్ వరకూ 33 డిగ్రీ కాలేజీలు ద్వారా 1,87,230 మంది విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్య, 20 లక్షల రూపాయల ఓవర్సీస్ స్కాలర్షిప్పులు తదితర ఎన్నో పథకాల ద్వారా వెనుకబడిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు.

విలేకరుల సమావేశంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ, రాష్ట్ర సాంస్కృతిక సారథి, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు, సుడా చైర్మన్, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు జి.వి రామకృష్ణా రావు, నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News