Friday, May 2, 2025

అమెరికాలో భార్య, కుమారుడిని చంపి… ఆత్మహత్య చేసుకున్న భారతీయుడు

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికాలో భారత్‌కు చెందిన ఓ టెక్ తన భార్య, ఒక కుమారుడిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కర్నాటకలోని మాండ్యా జిల్లాకు చెందిన హర్షవర్ధన్(57), శ్వేత పన్యం(44) తన ఇద్దరు కుమారులతో కలిసి వాషింగ్టన్ ప్రాంతం న్యూక్యాజిల్‌లో ఉంటున్నాడు. హర్షవర్ధన్ తన భార్య శ్వేత, ఒక కుమారుడిని తుపాకీతో కాల్చి చంపి అనంతరం తాను కాల్చుకున్నాడు. మరో కుమారుడు ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఏప్రిల్ 24న ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని స్థానిక పోలీసులు వెల్లడించారు. 2017లో భార్య శ్వేతతో కలిసి భారత్‌కు తిరగొచ్చాడు. మైసూర్ లో హోలోవరల్డ్ అనే రోబోటిక్ కంపెనీని ప్రారంభించారు. ఈ కంపెనీకి సహ వ్యవస్థాపకురాలి శ్వేత ఉంటున్నారు. కంపెనీకి మంచి పేరు రావడంతో సరిహద్దులో భద్రత కోసం రోబోలను తయారు చేసేందుకు ప్రధాని నరేంద్రమోడీని హర్షవర్ధన్ కలిశారు. కరోనా సమయంలో నష్టాలు రావడంతో కంపెనీని మూసేసి మళ్లీ అమెరికాకు వెళ్లిపోయారు. గతంలో హర్షవర్ధన్ మైక్రోసాఫ్ట్‌లో పని చేసినట్టు సమాచారం. రోబోటిక్ నిపుణుడిగా హర్షవర్ధన్‌కు మంచి పేరు ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News