Thursday, May 2, 2024

కొత్తగా 10,853 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Newly 10,853 corona cases in India

 

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 10,853 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,43,55,536కు పెరిగాయి. ఇందులో 3,37,49,900 మంది కరోనా నుంచి కోలుకోగా, 4,60,791 మంది బాధితులు మరణించారు. మరో 1,44,845 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇది గత 260 రోజుల్లో కనిష్టమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 12,432 మంది కోలుకున్నారని, 526 మంది మరణించారని తెలిపింది. దీంతో దేశంలో యాక్టివ్‌ కేసుల రేటు 0.42 శాతం, మరణాల రేటు 1.34 శాతం, కోలుకున్నవారి రేటు 98.24 శాతంగా ఉన్నదని పేర్కొన్నది. టీకా పంపిణీకి సంబంధించి మొత్తంగా 107.92 కోట్లకు పైగా డోసుల పంపిణీ అయ్యాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News