Tuesday, April 30, 2024

దాడులకు కుట్ర పన్నిన లష్కరే ఉగ్రవాదికి పదేళ్ల జైలుశిక్ష

- Advertisement -
- Advertisement -

NIA court sentences Pak terrorist to 10 years in prison

 

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాది బహదూర్‌అలీకి పదేళ్ల జైలు శిక్షను ఢిల్లీలోని ఎన్‌ఐఎ కోర్టు ఖరారు చేసింది. గత శుక్రవారమే అలీని దోషిగా కోర్టు నిర్ధారించింది. బుధవారం శిక్షను ప్రకటించింది. పాకిస్థాన్ నుంచి లష్కరే ఉగ్రవాద నేతల ఆదేశాలమేరకు ఢిల్లీతోపాటు దేశంలోని పలు చోట్ల దాడులకు కుట్ర పన్నినట్టు అలీపై అభియోగాలు నమోదయ్యాయి. 2016 జులైలో ఈ కేసు నమోదైంది. 2017 జనవరిలో అలీపై ఎన్‌ఐఎ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇదే కేసులో నిందితులైన పాకిస్థాన్ ఉగ్రవాదులు అబూసాద్, అబూదార్దాలు 2017 ఫిబ్రవరిలో కుప్వారాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. ఈ కేసులోని ఉగ్రవాదులకు సహకరించిన జమ్మూకాశ్మీర్‌కు చెందిన జహూర్ అహ్మద్‌పీర్, నజీర్ అహ్మద్‌పీర్‌లను ఎన్‌ఐఎ అరెస్ట్ చేసింది. వీరిపై తదుపరి విచారణ జరగనున్నట్టు ఎన్‌ఐఎ తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News