Sunday, April 28, 2024

ఢిల్లీలో లష్కర్ టెర్రరిస్ట్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రిటైరైన సైనిక జవాన్, నిషిద్ధ ఉగ్ర సంస్థ లష్కరే తయ్యిబా (ఎల్‌ఇటి) సభ్యుడుగా భావిస్తున్న రియాజ్ అహ్మద్‌ను ఢిల్లీ పోలీసులు ఆదివారం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో అరెస్టు చేశారు. జమ్మూ కుప్వారా ప్రాంతంలో దాడులకు కుట్రను భగ్నం చేస్తూ కుప్వారా జిల్లాలో కార్యకలాపాలు సాగిస్తున్న ఎల్‌ఇటి విభాగం గుట్టును జమ్మూ కాశ్మీర పోలీసులు రట్టు చేసిన కొన్ని రోజుల తరువాత రియాజ్ అహ్మద్ అరెస్టు జరిగింది. మరి ఇద్దరు వ్యక్తులు ఖుర్షీద్ అహ్మద్ రాథర్,

ఘులామ్ సర్వార్ రాథర్తో కలసి రియాజ్ అహ్మద్ కుట్రలో చురుకుగా పాల్గొన్నాడని, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అందుకోవడానికి వాస్తవాధీన రేఖ (ఎల్‌ఒసి) ఆవల ఉగ్ర సంస్థల నేతలతో సమన్వయంగా పని చేశాడని పోలీసులు ఆరోపించారు. ‘నిందితుడు రియాజ్ అహ్మద్ రిటైరైన సైనిక ఉద్యోగి. జమ్మూ కాశ్మీర్‌లో విచ్ఛిన్న కార్యకలాపాలుసాగించేందుకు ఎల్‌ఇటి ఉగ్ర నేతల ద్వారా ఎల్‌ఒసి మీదుగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి అందుకోవడానికి తన సహచరులతో కలసి కుట్రలో చురుకుగా పాల్గొన్నాడు’ అని ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News