Saturday, April 27, 2024

మధ్యప్రదేశ్ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుళ్లు

- Advertisement -
- Advertisement -

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని హర్దాలో మంగళవారం ఒక బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి ఆరుగురు మరణించగా మరో 60 మంది గాయపడ్డారు. ఫ్యాక్టరీలో మంటలు వ్యాపించి వరుసగా అనేకసార్లు పేలుళ్లు సంభవించగా సమీపంలో నివసిస్తున్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారి ఒకరు తెలిపారు. పేలుళ్ల తీవ్రతకు నర్మదాపురం జిల్లాలోని సియోని మాల్వా ప్రాంతంలోని ఇళ్లు కంపించినట్లు అక్కడి నివాసులు తెలిపారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అధికారులతో మట్లాడి సంఘటన గురించి వివరాలు తెలుసుకున్నారు.

రాష్ట్ర మంత్రి ఉదయ్ ప్రతాప్ సింగ్, సీనియర్ అధికారులు హుటాహుటిన హర్దాకు బయల్దేరి వెళ్లారు. కాలిన గాయాలతో వచ్చే రోగుల కోసం బెడ్లను సిద్ధం చేయాలని భోపాల్, ఇండోర్‌లోని వైద్య కళాశాలలను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఘటన జరిగిన ఫ్యాక్టరీ వద్దకు మరి కొన్ని అగ్నిమాపక శకటాలను పంపించినట్లు ఆయన వివరించారు. ఈ సంఘటన జరిగినపుడు ఫ్యాక్టరీ లోపల 50 మంది కార్మికులు ఉన్నట్లు ప్రమాదం నుంచి తప్పించుకున్న ఒక కార్మికుడు పోలీసులకు తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News