Thursday, May 2, 2024

సాగుకు సాయం

- Advertisement -
- Advertisement -

Nirmala Sitharaman announces third Financial package

 

వ్యవసాయం, అనుబంధ రంగాల మౌలిక సదుపాయాలకు రూ.లక్ష కోట్లు
పంటలకు సరైన మద్దతు ధర
ఎక్కడ మంచి ధర పలికితే అక్కడే అమ్ముకునే సౌకర్యం
చట్టపరమైన మార్పులు
మత్సకారులకు రూ.20వేల కోట్లు
సూక్ష్మ ఆహార సంస్థలకు రూ.10వేల కోట్లు
మూడో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: ‘ఆత్మ నిర్భర్ భారత్’ ఆర్థిక ప్యాకేజీలో మూడో దశ వ్యవసాయం, అనుబంధ పరిశ్రమలపై ప్రభుత్వం దృష్టిపెట్టింది.

రూ.20 లక్షల కోట్ల విలువచేసే ఆర్థిక ప్యాకేజీలో మూడో దశ వివరాలను శుక్రవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ ప్యాకేజీలో వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల్లో మౌలిక సదుపాయాలు, నిర్మాణ సామర్థాలపై ప్రధానంగా దృష్టిపెట్టామని అన్నారు. గత రెండు నెలల్లో రైతులకు సహాయంగా అనేక చర్యలు చేపట్టామన్నారు. రెండు నెలల లాక్‌డౌన్ కాలంలో రూ.73,300 కోట్ల విలువచేసే కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి) కొనుగోళ్లు చేపట్టామన్నారు. పిఎం కిసాన్ నిధి కింద గత రెండు నెలల్లో రూ.18,700 కోట్ల రూపాయలను రైతుల ఖాతాకు బదిలీ చేశామ ని, పంట బీమా కింద రూ.6400 కోట్లు ఇచ్చామని వివరించారు. లాక్‌డౌన్ సమయంలో రోజుకు 560 లక్షల లీటర్ల పాలను సహకార సంస్థలు కొనుగోలు చేశాయి. రూ.4100 కోట్లు పాల ఉత్పత్తిదారుల చేతుల్లోకి వచ్చాయి.

వ్యవసాయ మౌలిక సదుపాయాలకు లక్ష కోట్లు..

వ్యవసాయ మౌలిక సదుపాయాల కోసం లక్ష కోట్ల రూపాయలు అందజేస్తామని మంత్రి తెలిపారు. దీంతో కోల్డ్ చైన్, పంట అనంతరం నిర్వహణ సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని, రైతు ఆదాయం కూడా పెరుగుతుందని అన్నారు. రైతులు తమ ఉత్పత్తులకు సరైన ధరను పొందటానికి, ఇతర రాష్ట్రాల్లో ఉత్పత్తిని విక్రయించడానికి వీలుగా చట్టపరమైన మార్పులు చేయనున్నట్టు మంత్రి చెప్పారు. రైతులు తమ ఉత్పత్తులను ఏ రాష్ట్రంలోనైనా తీసుకెళ్లడానికి, విక్రయించడానికి అనుమతిస్తామని అన్నారు.

ముఖ్యాంశాలు..

 

సూక్ష్మఆహార పరిశ్రమల(ఎంఎఫ్‌ఇ)ల క్రమబద్ధీకరణ కోసం క్లస్టర్ ఆధారిత రూ.10వేల కోట్ల పథకం ప్రారంభించామని, దీంతో 2 లక్షల ఎంఎఫ్‌ఇలు లబ్ధి పొందుతాయని అన్నారు.

మత్స పరిశ్రమకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఫిషరీస్ వాల్యూ చైన్‌లో సమస్యలను పరిష్కరించేందుకు పిఎం మత్స సంపద(పిఎంఎంఎస్‌వై) పథకం ద్వారా మత్సకారులకు రూ.20వేల కోట్లు కేటాయించారు. సముద్ర మత్స్య సంపద కోసం రూ.11 వేల కోట్లతో పాటు మౌలిక సదుపాయాలు సిద్ధం చేయడానికి రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తారు. ఇది రాబోయే 5 సంవత్సరాలలో చేపల ఉత్పత్తిని 7 మిలియన్ టన్నులకు పెంచుతుంది. దీంతో 55 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది.

జాతీయ జంతు వ్యాధి నియంత్రణ కార్యక్రమం పథకానికి రూ.13,343 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ పథకం కింద జంతువులకు నోరు, నోటి వ్యాధి నుండి రక్షణ కల్పించడానికి టీకాలు వేయనున్నారు. ఈ పథకం కింద 53 కోట్ల జంతువులకు టీకాలు వేస్తారు. ఇప్పటివరకు 1.5 కోట్ల ఆవులు, గేదెలకు టీకాలు వేశారు. ఇది పాల ఉత్పత్తిని పెంచుతుంది. ఉత్పత్తిదారుల నాణ్యతను మెరుగుపరుస్తుంది.

పశుసంవర్ధకంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.15 వేల కోట్లు అందివ్వనున్నారు.

తేనెటీగల పెంపకం కోసం 500 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. దీనివల్ల 2 లక్షల తేనెటీగ కీపర్లు ప్రయోజనం పొందుతారు.

మూలికా వ్యవసాయం కోసం 4 వేల కోట్లు మంజూరు చేశారు. రాబోయే రెండేళ్లలో 10 లక్షల హెక్టార్ల భూమిలో మూలికా వ్యవసాయం. మూలికా వ్యవసాయం ద్వారా రైతులకు 5 వేల కోట్ల ఆదాయం లభిస్తుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News