Sunday, April 28, 2024

జలటోపీపై ఎపికి నోటీసు

- Advertisement -
- Advertisement -

Srisailam water evacuation should be clarified on GO

 

శ్రీశైలం నీటి తరలింపు జిఒపై వివరణ ఇవ్వాలి
తెలంగాణ ఫిర్యాదుపై స్పందించిన కృష్ణా నది యాజమాన్య బోర్డు

మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీ యాజమాన్యం బోర్డు ఎపి ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఎలాంటి అనుమతులు లేకుండా శ్రీశైలం జలాల తరలింపుపై వివరణ కోరింది. గతంలో పలుమార్లు లేఖలు రాసినా ఇప్పటివరకు ఎందుకు సమాధానాలు ఇవ్వలేదని ఈ నోటీసులో ప్రశ్నించింది. 11వ షెడ్యూల్డు మేరకు గోదావరినది, కృష్ణానదీ పరివాహక ప్రాంతాల్లో ఎపి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అపెక్స్ కమిటీ అనుమతి లేకుండా ఎలాంటి నూతన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టరాదని లేఖలో పేర్కొంది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అదనంగా మూడ టిఎంసిల నీటిని పంప్ చేసే కొత్త స్కీంపై వివరణ కోరింది.

ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం జలాలను అక్రమంగా తరలించేందుకు పోతిరెడ్డిపాడు సామర్థం పెంచుతూ జారీచేసిన 203ఉత్తర్వులను రద్దు చేయాలని తెలంగాణ చేసిన ఫిర్యాదు మేరకు కృష్ణా యాజమాన్యంబోర్డు ఎపి సర్కార్‌కు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదు కాపీని కూడా ఈ నోటీసుకు జతచేసి పంపించింది. తక్షణం వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ కృష్ణనదీ యాజమాన్యబోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యార్ ఈ నోటీసు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌విభజన చట్టం స్ఫూర్తికి ఎపి ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టుల నిర్మాణం విఘాతం కల్పిస్తోందని లేఖలో పేర్కొన్నారు.

శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడుకు 80వేలకు పైగా టిఎంసిల నీటిని తరలించేదుకు 10 తూముల నిర్మాణాలను తలపెట్టిందనీ, అలాగే ఇప్పటికే శ్రీశైలం నుంచి నాలుగు సొరంగమార్గాల నుంచి రోజుకు 4వేల టిఎంసిలను తరలిస్తోందని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్ ఫిర్యాదు ఇవ్వడంతో పాటు స్వయంగా బోర్డు సభ్యులను కలిసి డిమాండ్ చేశారు. ఎపి సర్కార్ అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తే నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణానదీ జలాలపై ఆధారపడి నిర్మాణమవుతున్న ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటని బోర్డుకు రజత్‌కుమార్ ఫిర్యాదు చేశారు. అలాగే బచావత్ ట్రిబ్యునల్ మేరకు కృష్ణా నదీజలాల వాటాలో తెలంగాణకు అన్యాయం జరిగిందని తిరిగి లెక్కింపులు జరగాలని రజత్‌కుమార్ డిమాండ్ చేశారు.

అయితే కృష్ణ నదీ యాజమాన్యం బోర్డు నోటీసుకు సమాధానం ఇచ్చేంతవరకు ఎలాంటి పనుల చేపట్టవద్దని నోటీసులో ఉన్నట్లు సమాచారం. 203 జిఒ మేరకు ఆంధ్రసర్కార్ ఇప్పటికే రూ 6,8219,15 కోట్లను కేటాయించి పనులు ప్రాంభించిందని తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదును కృష్ణాయాజమాన్యం బోర్డు తీవ్రంగా పరిగణించింది. అంతరాష్ట్ర నదీజలాలకు సంబంధించి అపెక్స్ కమిటీ అనుమతి లేనిదే ప్రాజెక్టులు కట్టవద్దనీ, సంప్రదింపుల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఈ లేఖలో పేర్కొన్నట్లు అధికారులు చెప్పారు.

నోటీసుతో సరిపెట్టవద్దు జిఒ రద్దు చేయాలి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జిఒను రద్దు చేసేవిధంగా బోర్డు చర్యలు చేపట్టాలని నీటిపారుదల శాఖకు సంబంధించిన ఇంజనీర్లు డిమాండ్ చేస్తున్నారు. నోటీసు అనంతరం ఆంద్రప్రదేశ్ ఇచ్చిన సమాధానం పరిశీలించి 203 జిఒను రద్దు చేయాలని చీఫ్ ఇంజనీర్ నర్సింహులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News