Thursday, May 2, 2024

నిత్యానందకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ

- Advertisement -
- Advertisement -

Non-bailable warrant issued to Nithyananda

బెంగళూరు : వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. 2010లో జరిగిన అత్యాచారం కేసుకు సంబంధించి బెంగళూరు లోని రామనగర్ జిల్లా సెషన్స్ కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. అయితే కాలపరిమితి లేని నాన్‌బెయిలబుల్ మాదిరి ఓపెన్ ఎండెడ్ వారెంట్‌ను కోర్టు గతం లోనే జారీ చేసింది. అత్యాచార కేసులో విచారణకు హాజరు కావాలంటూ గతంలో వారెంట్ జారీ చేసినప్పటికీ ఆయన ఆచూకీని మాత్రం పోలీసులు ఇప్పటికీ గుర్తించలేక పోయారు. నిత్యానందపై నమోదైన అత్యాచార కేసుకు సంబంధించి విచారణ గతం లోనే మొదలయ్యింది. ఇప్పటివరకు ముగ్గురు సాక్షులను న్యాయస్థానం విచారించింది. అయితే నిందితుడు హాజరు కాకపోవడంతో గత మూడేళ్లుగా ఈ కేసు విచారణ నిలిచిపోయింది. 2019 నుంచి ఇప్పటివరకు ఇచ్చిన సమన్లకు నిత్యానంద స్పందించక పోవడంతో సెప్టెంబర్ 23 లోగా కోర్టు ముందు హాజరు కావాలంటూ నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నిత్యానంద మాజీ డ్రైవర్ లెనిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2010లో ఆయనపై అత్యాచార కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టైన నిత్యానందస్వామి తర్వాత బెయిలుపై బయటకు వచ్చాడు. అనంతరం నిత్యానంద దేశం నుంచి పారిపోయాడనే వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని పేర్కొంటూ లెనిన్ 2020లో కోర్టును ఆశ్రయించడంతో నిత్యానంద బెయిల్‌ను న్యాయస్థానం రద్దు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News