Sunday, April 28, 2024

ఫిలింనగర్‌లో దారుణం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నగరంలోని ఫిలింనగర్‌లో ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. వివాహిత భర్తను దారుణంగా హతమార్చాడు. ఫిలింనగర్‌లో వివాహిత భర్తతో కలిసి నివసిస్తుంది. వివాహిత లండన్‌లో చదువుకునే సమయంలో ఓ యువకుడితో పరిచయమేర్పడింది. దీంతో వివాహం చేసుకోవాలని యువతిని వేధించాడని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. అయితే చదువు పూర్తైన తర్వాత వేరే యువకుడితో యువతికి వివాహం జరిగింది .అయితే వివాహం జరిగినా కూడ తనతో రావాలని యువతిని ఆ యువకుడు వేధించాడని బాధితురాలు ఆరోపిస్తుంది. అయితే తాను రాలేనని ఆ యువతి తెగేసి చెప్పినట్టుగా బాధితురాలు చెబుతున్నారు.

బుధవారం ఉదయం యువతి ఇంటికి వచ్చిన యువకుడు ఆమెను కిడ్నాప్ చేసేందుకు ఆ యువకుడు యత్నించాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ సమయంలో యువతి భర్త అడ్డుకున్నాడు. యువతి భర్తపై ఆ యువకుడు దాడికి దిగాడని బాధితులు చెబుతున్నారు.ఈ దాడిలో యువతి భర్త తీవ్రంగా గాయపడి మృతి చెందాడని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనకు పాల్పడిన యువకుడితో పాటు అతడికి సహకరించిన మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News