Tuesday, April 30, 2024

మే 20న మార్కెట్లకు సెలవు

- Advertisement -
- Advertisement -

2024 మే 20న సెలవు రోజు కావడంతో స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఎలాంటి ట్రేడింగ్ ఉండదని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రకటించింది. మే 20న ముంబైలో లోక్‌సభ ఎన్నికలకు ఓటింగ్ జరగనుంది. ఈ రోజు సెలవు కారణంగా స్టాక్ ఎక్స్ఛేంజ్ మూసివేస్తారు. మహారాష్ట్రలో ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఐదో దశలో ముంబైలోని లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. మే 20న స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్‌కు సెలవు ఉంటుందని ఎన్‌ఎస్‌ఇ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

నిఫ్టీ మిడ్‌క్యాప్ సెలెక్ట్ కాంట్రాక్ట్‌ల డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ఇప్పుడు మే 20కి బదులుగా మే 17న శుక్రవారానికి ముగుస్తుందని సర్క్యులర్ జారీ చేసింది. మే 1న కూడా స్టాక్ ఎక్స్ఛేంజీలకు సెలవు ఉంటుంది. మే 1 మహారాష్ట్ర దినోత్సవం స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ ఉండదు. ఈ నెలలో కూడా ఈద్ సెలవు కారణంగా ఏప్రిల్ 11న సెలవు, రామ నవమి కారణంగా ఏప్రిల్ 17న మార్కెట్‌లో ట్రేడింగ్‌కు సెలవు ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News