Thursday, May 2, 2024

అప్పుడే రైతాంగానికి నమ్మకం కలుగుతుంది: నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Oil palm cultivation encouraged

హైదరాబాద్: కేటాయించిన జిల్లాలలో పామాయిల్ ఫ్యాక్టరీల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని,  అప్పుడే ఆయిల్ పామ్ సాగుపై రైతాంగానికి నమ్మకం కలుగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆయిల్ కంపెనీలకు సూచించారు. హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు పెంచడానికి చేపట్టిన చర్యలపై రాష్ట్రంలో పని చేస్తున్న 11 ఆయిల్ పామ్ కంపెనీల ప్రతినిధులతో సమీక్ష సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, ఆయిల్ ఫెడ్ ఎండి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జిల్లాల వారీగా రైతులను కొత్తగూడెం జిల్లాలో క్షేత్ర సందర్శన కు తీసుకు వెళ్ళి వారికి పూర్తి అవగాహన కల్పించాలని,  ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగు చేపట్టాలి అని నిర్ణయించినందున, కంపెనీలు అవసరం ఉన్నంత మేరకు నాణ్యమైన మొక్కలను వారి వారి నర్సరీలలో పెంచి రైతులకు సకాలంలో అందించాలని అధికారులకు నిరంజన్ రెడ్డి సూచించారు.  రైతులకు అవగాహన కల్పించడం కోసం విత్తనం నుండి ఆయిల్ తీసే విధానం వరకు అన్నీ అంశాలను రైతులకు అర్థమయ్యే విధంగా సుమారు అర గంట నిడివి గల డాక్యుమెంటరీ రూపొందించాలని ఆయిల్ ఫెడ్ ఎండికి నిరంజన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.  కంపెనీల వారీగా నర్సరీల ఏర్పాటు చేసుకోవాలని, దిగుమతి చేసుకున్న ఆయిల్ పామ్ విత్తన మొలకలను పెంచుతున్న విధానము, అవి నాటాడానికి అందుబాటులోకి వచ్చే సమయము మొదలైన అంశాల పై సుధీర్గంగా సమీక్షలు జరిపారు. ఆయిల్ పామ్ మొక్కల లభ్యత, నాణ్యత పరిశీలనకు త్వరలోనే నర్సరీల సందర్శన ఉంటుందని చెప్పారు.  ఆయిల్ పామ్ విత్తన మొలకలపై దిగుమతి సుంకాన్ని రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 30 శాతం నుండి 5 శాతానికి తగ్గించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News