రైతాంగం అంశాలపై కేంద్రం మొండిగా వ్యవహరిస్తోంది, వ్యవసాయరంగానికి సంబంధించిన సమస్యలపై విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆదివారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రంలో ఫామాయిల్ పంటల దిగుబడి గణనీయంగా ఉన్నందున కొన్ని చోట్ల ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలను ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి తుమ్మల సిఎంకు వివరించారు. అశ్వరావుపేట, సిద్దిపేట జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఏర్పాటుకు వీలుగా ఏదో ఒక చోట ప్రారంభోత్సవానికి రావాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. దాంతో పద్రాగస్టు త్వరాత సిద్దిపేట జిల్లాలో ఏర్పాటుచేసే కార్యక్రమానికి హాజరవుతానని ముఖ్యమంత్రి తుమ్మలకు స్పష్టత ఇచ్చారు. అదేవిధంగా మిగతా అంశాలపై త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.
సిద్దిపేటలో అయిల్ ఫామ్ ఫ్యాక్టరీ
- Advertisement -
- Advertisement -
- Advertisement -