Monday, April 22, 2024

బడ్డీ కామెడీ మూవీ..

- Advertisement -
- Advertisement -

హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ… ‘హుషారు’ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన అవుట్ అండ్ అవుట్- ఎంటర్‌టైనర్ ‘ఓం భీమ్ బుష్’ తో ప్రేక్షకులని ఆలరించబోతున్నారు. వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ సినిమాని నిర్మిస్తుండగా, యువి క్రియేషన్స్ సమర్పిస్తోంది. ‘ఓం భీమ్ బుష్’ మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో ప్రియదర్శి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. దర్శకుడు హర్ష ‘ఓం భీమ్ బుష్’ కథ చెప్పినప్పుడు చాలా నచ్చింది. శ్రీ విష్ణు, రాహుల్ అనేసరికి ఇంకా ఆసక్తి పెరిగింది. అలాగే యువీ లాంటి బలమైన నిర్మాణ సంస్థ వుండటం.. ఇలా అన్నీ కుదిరాయి. కథలో చాలా ఆసక్తికరమైన ఐడియా వుంది.

దానికి ఫాంటసీ, హారర్ ఎలిమెంట్ కూడా జత చేయడం ఇంకా క్రేజీగా అనిపించింది. ఇందులో నా పాత్ర పేరు డా. వినయ్ గుమ్మాడి. మా ఫ్రెండ్స్ అంతా ఉస్మానియాలో పీహెచ్డీ చేయాలనీ చేరుతాం. కానీ ముఖ్య ఉద్దేశం మాత్రం అక్కడ వచ్చే స్టయిఫండ్ , ఉచిత హాస్టల్ సౌకర్యం కోసం. నాది నమ్మే బిలివ్ చేసే పాత్ర. మిగతా ఇద్దరు మాత్రం మంత్రాలు, తంత్రాలని నమ్ముతారు. అలా మా ముగ్గురి మధ్య మంచి కామేడీ వుంటుంది. సినిమా అంతా ఎంటర్ టైన్ మెంట్ వుంటుంది. మధ్యలో మంచి ఎమోషనల్ పాయింట్ వుంది. అది యూనిక్‌గా వుంటుంది. ఈ సినిమాలో ఆయేషా ఖాన్ నా జోడిగా కనిపిస్తారు. అలాగని రొమాంటిక్ సాంగ్స్ ఏమీ వుండవు. ఇది బడ్డీ కామెడీ మూవీ. ఎక్కడా అసభ్యతకు తావులేకుండా చాలా అందరూ ఎంజాయ్ చేపేలా చాలా క్లీన్‌గా సినిమా చేశాం.‘ఓం భీమ్ బుష్’లో మేం ముగ్గురం తింగరి పనులు చేసి సమస్యలలో ఇరుక్కుంటాం.

నిర్మాతలు సునీల్, వంశీ సినిమాని చాలా గ్రాండ్ గా నిర్మించారు. ఇందులో భారీ మహల్ సెట్ వుంటుంది. ఫిల్మ్ సిటీలో మ్యాసీవ్ సెట్ వేశారు. అలాగే సినిమాకి కావాల్సిన ప్రతిది ఎక్కడా రాజీపడకుండా సమకూర్చారు. ఇందులో గ్రీక్ తరహా గెటప్ లో ముగ్గురం వుంటాం. మాతో పాటు ఫారిన్ లేడీస్ నటించారు. ఇది ఓ పేలెస్ లో షూట్ చేశారు. ఆ పాలెస్ పుణెకు 70 కిలోమీలర్ల దూరంలో వుండే థోర్ అనే ప్రాంతంలో వుంది. అక్కడ సినిమా చాలా బ్రహ్మాండగా వచ్చింది. ఈ నేపథ్యంలో ఓ సాంగ్ కూడా వుంటుంది. ఇదంతా డ్రీమ్ సాంగ్‌లా వస్తుంది. ఇక లీడ్ రోల్‌లో నేను ఓ సినిమా చేస్తున్నా. షూటింగ్ జరుగుతోంది. అలాగే గేమ్ ఛేంజర్‌లో కూడా నటి స్తున్నాను.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News