Friday, May 3, 2024

రిస్క్ దేశాల నుంచి 16000 మంది

- Advertisement -
- Advertisement -
Omicron variant in India/
18 మందికి పాజిటివ్, జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపాం : కేంద్రమంత్రి మాండవ్య

న్యూఢిల్లీ: రిస్క్ దేశాల నుంచి 16000మంది విమాన ప్రయాణికులకు ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు నిర్వహించగా 18మందికి పాజిటివ్ తేలిందని కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి మన్‌సుఖ్‌మాండవ్య తెలిపారు. ఆ ప్రయాణికుల శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపి ఒమిక్రాన్‌ను గుర్తించే ప్రక్రియ జరుగుతున్నదని ఆయన తెలిపారు. శుక్రవారం లోక్‌సభలో కరోనా మహమ్మారిపై చర్చ సందర్భంగా మాండవ్య ఈ వివరాలు వెల్లడించారు. భవిష్యత్‌లో ఎదురుకానున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ఆయన తెలిపారు. ఓవేళ కొవిడ్ కేసులు పెరిగినా, ఔషధాలకు కొరత లేకుండా రాష్ట్రాల వద్ద నిల్వలు సిద్ధంగా ఉంచామని మాండవ్య తెలిపారు. శాస్త్రవేత్తల సలహామేరకే చిన్నారులకు టీకాలు, పెద్దవారికి బూస్టర్ డోసులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. శాస్త్రవేత్తలపై నమ్మకముంచాలంటూ ప్రతిపక్షాలకు మాండవ్య సూచించారు.

17 ఏళ్లలోపు పిల్లలకు టీకాపై నిపుణుల కమిటీ అధ్యయనం

దేశంలో 12నుంచి 17 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు వ్యాక్సినేషన్‌పై కొవిడ్ 19 వ్యాక్సినేషన్‌పై ఏర్పాటు చేసిన జాతీయ నిపుణుల కమిటీ, జాతీయ సాంకేతిక గ్రూపు చర్చిస్తున్నాయని, వీటికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలను పరిశీలిస్తున్నాయని ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభకు తెలియజేసింది. కాగా చిన్నారులకు, యుక్త వయస్కులకు ఉపయోగించడం కోసం వ్యాక్సిన్ దిగుమతికి సంబంధించి ఏ ప్రతిపాదన ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో లేదని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంతో తెలిపారు. విదేశీ కొవిడ్ వ్యాక్సిన్లకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధికారం ఈ రెండు కమిటీలకు ఇచ్చినట్లు ఆమె తెలిపారు. 12నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు ్టకా ఇవ్వడానికి సంబంధించి ప్రభుత్వం ఏదయినా రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసిందా అని అడగ్గా, దీనికి సంబంధించి శాస్త్రీయ ఆధారాలను ఈ రెండు కమిటీలు పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News