Thursday, May 2, 2024

అఫ్ఘానిస్థాన్‌లో మహిళల బలవంతపు పెళ్లిళ్లపై తాలిబన్ల నిషేధం!

- Advertisement -
- Advertisement -

Taliban Decree an End to Forced Marriages in Afghan

కాబూల్: యుద్ధంతో దెబ్బతిన్న అఫ్ఘానిస్థాన్‌లో మహిళల బలవంతపు పెళ్లిలను నిషేధిస్తూ తాలిబన్ ప్రభుత్వం శుక్రవారం డిక్రీ జారీచేసింది. తాలిబన్ ప్రభుత్వాన్ ప్రభుత్వాన్ని గుర్తించాలన్నా, సాయంను పునరుద్ధరించాలన్నా తాలిబన్లు మహిళల బలవంతపు పెళ్లిలపైస తమ డిమాండ్‌న నెరవేర్చాల్సి ఉంటుందన్న షరతు కారణంగానే తాలిబన్లు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. తాలిబన్లు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆ సంస్థ అగ్రనేత హైబతుల్లా అఖుంజాదా ప్రకటించారు. అఫ్ఘానిస్థాన్‌ను మత మిలిషియా అయిన తాలిబన్లు ఆగస్టులో తమ నియంత్రణలోకి తీసుకున్నాక అక్కడ పేదరికం పెరిగింది. అఫ్ఘానిస్థాన్‌కు విదేశాల నిధులు ఆగిపోవడంతో ఆ దేశ ఆర్థికవ్యవస్థ స్తంభించిపోయింది.

“స్త్రీ, పురుషులు ఇరువురూ సమానమే. ఏ మహిళను బలవంతపెట్టి వివాహం చేయకూడదు” అని తాలిబన్ తన డిక్రీలో పేర్కొంది. అఫ్ఘానిస్థాన్‌లో అంతర్జాతీయ సైనిక దళాలు ఉండడంతో గత దశాబ్ద కాలంలో అక్కడ మహిళల హక్కులు మెరుగుపడ్డాయి. కానీ తాలిబన్లు అధికారాన్ని తిరిగి కైవసం చేసుకోవడంతో మహిళల హక్కులు అటకెక్కాయి. పేదరికం, సంప్రదాయిక దేశమైన అఫ్ఘానిస్థాన్‌లో మహిళల బలవంతపు పెళ్లిళ్లు సర్వసాధారణం. ఆర్థికంగా దెబ్బతిన్నవారు, అప్పుల పాలైనవారు తమ ఆడబిడ్డలను బలవంతంగా పెళ్లిలు చేయించక తప్పని పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. తాలిబన్లు తాజాగా విడుదల చేసిన డిక్రీలో ఏ వయస్సు మహిళలకు పెళ్లిలు చేయొచ్చో తెలుపలేదు. ఇదివరకు జారీ చేసిన డిక్రీలో అది 16 ఏళ్లుగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News