Thursday, May 2, 2024

నేటి నుంచి ఆన్‌లైన్ క్లాసులు

- Advertisement -
- Advertisement -

Online Classes starts from July 1 in Telangana

నేటి నుంచి ఆన్‌లైన్ క్లాసులు
ప్రభుత్వ పాఠశాలల్లో 3 నుంచి 10 తరగతులకు
ఆగస్టు 1 నుంచి ఒకటి, రెండవ తరగతులకు క్లాసులు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు గురువారం నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 3వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు బోధించనుండగా, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ఒకటవ తరగతి నుంచి ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించుకునేందుకు వెసులుబాటు కల్పించారు. సర్కారు బడుల్లో మాత్రం ఆగస్టు 1 నుంచి ఒకటి, రెండు తరగతులకు ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించనున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతులకు నిర్వహించేందుకు ఉపాధ్యాయులు ఏర్పాట్లు చేశారు. స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్‌నెట్ సౌకర్యం లేనివారికి గత ఏడాది మాదిరిగానే దూరదర్శన్ యాదగిరి, టీశాట్ ద్వారా ఆన్‌లైన్ బోధన నిర్వహించనున్నారు. వద్దనైనా టీవీలు లేకపోతే గ్రామపంచాయితీ కార్యాలయాల్లోనూ, గ్రంథాలయాల్లోని టీవిలను వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఆన్‌లైన్ తరగతుల్లో విద్యార్థుల సందేహాల నివృత్తికి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య దాదాపు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతిరోజూ విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులు వింటున్న తీరును టీచర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ విద్యార్థులతో వాట్సాప్ ద్వారా నిరంతరం సంభాషించనున్నారు. విద్యార్థులకు సంబంధించిన డిజిటల్ క్లాసులు, వర్క్ షీట్లను ఎస్‌సిఇఆర్‌టి వెబ్‌సైట్ htts ://scert.telangana.gov.inలో పొందుపరిచారు.
ఇంటర్ సెకండియర్ విద్యార్థులకే ఆన్‌లైన్ తరగతులు
రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకే ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు జులై 1 నుంచి 15 వరకు టీశాట్, దూరదర్శన్ ద్వారా నిర్వహించే ఆన్‌లైన్ తరగతులు షెడ్యూల్‌ను ఇప్పటికే ప్రకటించింది. ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు ముగిసిన అనంతరం వారికి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించనున్నారు.ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు జులై 5 వరకు జరుగనున్నాయి. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత మొదటి సంవత్సరం విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా కొవిడ్ పరిస్థితుల కారణంగా ఫీజు తీసుకోకుండానే అనుమతులు పునరుద్ధరించాలనే యాజమాన్యాల అభ్యర్థనపై సమాలోచనలు జరిపిన బోర్డు… జూనియర్ కళాశాలల గుర్తింపు ప్రక్రియలో పలు మినహాయింపులు ఇస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన అనుబంధ గుర్తింపు ఫీజులను ఇంటర్ బోర్డు వెనక్కి తీసుకుంది. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో 15 మీటర్ల లోపు ఎత్తు భవనాల్లో నిర్వహిస్తున్న ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఆటోమేటిక్‌గా గుర్తింపు పునరుద్దరించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. గత ఏడాది ఫీజులతోనే కాలేజీల గుర్తింపును పునరుద్ధరించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. శానిటరీ, నిర్మాణ సామర్థ్య ధ్రువీకరణ పత్రాలు, 33 శాతం సిబ్బంది వివరాలను 90 రోజుల్లో సమర్పించేందుకు యాజమాన్యాలకు అవకాశం ఇచ్చింది.

Online Classes starts from July 1 in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News