Tuesday, December 10, 2024

పాకిస్థాన్‌దే వన్డే సిరీస్

- Advertisement -
- Advertisement -

జింబాబ్వేతో గురువారం జరిగిన మూడో, చివరి వన్డేలో పాకిస్థాన్ 99 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో పాక్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. తొలి వన్డేలో జింబాబ్వే విజయం సాధించగా, చివరి రెండు మ్యాచుల్లో పాకిస్థాన్ జయకేతనం ఎగుర వేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. ఓపెనర్లు సైమ్ అయూబ్, అబ్దుల్లా షఫిక్ శుభారంభం అందించారు.

సైమ్ (31), షఫిక్ 50 పరుగులు చేశారు. ఇక అద్భుత ఇన్నింగ్స్ ఆడిన కామ్రాన్ గులామ్ 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 103 పరుగులు సాధించాడు. రిజ్వాన్ (37), సల్మాన్ ఆఘా (30), తాహిర్ 29 (నాటౌట్) తమవంతు సహకారం అందించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 40.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఇర్విన్ (51) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. పాక్ బౌలర్లలో సైమ్, అబ్రార్, హారిస్ రవూఫ్, జమాల్ రెండేసి వికెట్లను పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News