Thursday, May 2, 2024

నగదు, మందుగుండు తెస్తున్న పాకిస్థాన్ డ్రోన్ కూల్చివేత!

- Advertisement -
- Advertisement -

రాజౌరి: రాజౌరీలోని బేరి పట్టాన్ ప్రాంతంలో ఏప్రిల్ 12 – 13 మధ్య రాత్రి పాకిస్థాన్ నుంచి వచ్చిన డ్రోన్‌ను భారత సైన్యం కూల్చివేసింది. నియంత్రణ రేఖ(ఎల్‌ఓసి)లో అనుమానస్పదంగా కదులాడుతుండడంతో ఆ డ్రోన్‌ను కూల్చివేశారు.
‘నియంత్రణ రేఖపై అనుమానస్పదంగా డ్రోన్ కదులాడుతోందని తెలియగానే కార్డన్, సెర్చ్ ఆపరేషన్ మొదలెట్టారు. డ్రోన్ కదలికలను ట్రాక్ చేశారు. లోడ్‌చేసిన ఐదు ఎకె మ్యాగజైన్‌లు, కొంత డబ్బు, సీల్డ్ ప్యాకెట్ ఆ డ్రోన్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది’ అని సైనిక పిఆర్‌వో తెలిపారు. భారత సైన్యం, పోలీస్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా సెక్టార్‌లోని సుందర్‌బనిలో ఆ డ్రోన్‌ను కూల్చేశారు.

సైన్యం హెక్సాకాప్టర్(డ్రోన్)ను స్వాధీనం చేసుకుని 28వ ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్ వద్దకు తీసుకొచ్చింది. తర్వాత తెరిచి చూసినప్పుడు ఇవి అందులో దొరికాయి: 1) రెండు లక్షల భారత కరెన్సీ, 2)131 రౌండ్స్, 3)ఐదు మ్యాగజైన్స్, 4)ఐదు స్లింగ్స్, 5) నాలుగు బ్యాటరీలు ఉన్న హెక్సాకాప్టర్. దీనికి ముందు కూడా మార్చి 10న పాకిస్థాన్ డ్రోన్‌ను, ఫిబ్రవరి 26న ఇంకో పాకిస్థాన్ డ్రోన్‌ను బిఎస్‌ఎఫ్ సిబ్బంది కూల్చేశారు.

confiscated items

Recovered from drone

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News