Monday, May 6, 2024

బిబిసి ఇండియాపై ఇడి ఫెమా కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: విదేశీ మారకం(ఫోరెక్స్) ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(బిబిసి) ఇండియాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) గురువారం కేసు నమోదు చేసింది. పన్ను ఎగవేత కేసుకు సంబంధించి రెండు నెలల క్రితం న్యూఢిల్లీ, ముంబైలోని బిబిసి కార్యాలయాలను ఆదాయం పన్ను శాఖ సోదా చేసిన విషయం తెలిసిందే. ఫారిన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్(ఫెమా) నిబంధనల కింద వాంగ్మూలాలను నమోదు చేసేందుకు దస్త్రాలతో బిబిసి ఎగ్జిక్యూటివ్‌లు తమ ఎదుట హాజరుకావాలని బిబిసి ఇండియాను ఇడి అదేశించినట్లు గురువారం అధికారులు వెల్లడించారు.

ఎఫ్‌డియు నిబంధనలను బిబిసి ఉల్లంఘించడంపై ఇడి దర్యాప్తు జరుపుతుందని వారు చెప్పారు. బిబిసి గ్రూపు సంస్థలు చూపుతున్న ఆదాయం, లాభాలు ఆ సంస్థ భారత్‌లో జరుపుతున్న కార్యకలాపాల స్థాయితో సరిపోలడం లేదని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సిబిడిటి) చెప్పడంతో ఇడి రంగంలోకి దిగింది. ఆ సంస్థ విదేశీ కార్యాలయాలకు జమ చేసిన మొత్తాలను భారత్‌లో వచ్చిన ఆదాయంగా చూపలేదని సిబిడిటి పేర్కొంది.

Also Read: జూ. ఎన్‌టిఆర్ సిఎం సిఎం అంటూ నినాదాలు… బాబు అసహనం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News