Thursday, May 2, 2024

సర్వసుందరంగా పంచాయతీలు

- Advertisement -
- Advertisement -

పంచాయతీ రాజ్ వ్యవస్థను 1993లోని 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీ రాజ్ రాజ్యాంగబద్ధం చేయబడింది. ఈ బిల్లును 22 డిసెంబర్ 1992న లోక్‌సభ, అదే విధం గా 23 డిసెంబర్ 1992న రాజ్యసభ ఆమోదించిన తర్వా త ఇది 17 రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించాయి. రాష్ట్రపతి ఆమోదం 23 ఏప్రిల్ 1993న పొందింది. అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ 24 ఏప్రిల్ 2010 న మొదటి జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని ప్రకటించారు. పంచాయతీ రాజ్ సంస్థలు సక్రమంగా పని చేసి, స్థానికులు అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములైతే, మావోయిస్టుల ముప్పును ఎదుర్కోవచ్చని ఆయన పేర్కొన్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎన్నికైన ప్రతినిధులను ఉద్దేశించి 25 ఏప్రిల్ 2015 న ‘మహిళా సర్పంచ్‌ల భర్తలు’ లేదా ‘సర్పంచ్ పతి’ అధికారానికి ఎన్నికైన వారి భార్యల పనిపై మితిమీరిన ప్రభావం చూపే పద్ధతికి స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు.

దేశ వ్యాప్తంగా జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏప్రిల్ 24న నిర్వహిస్తారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో ఈ దినోత్సవం ఘనంగా జరుపుతారు. ఆదర్శంగా నిలిచిన గ్రామ పంచాయతీలు, గ్రామ సభలను శక్తికరణ్ అవార్డు, రాష్ట్రీయ గౌరవ్ గ్రామ సభ అవార్డులతో సత్కరిస్తారు. 1993 లో భారత రాజ్యాంగం 73 వ చట్ట సవరణ జరిగింది. ఈ సవరణ ద్వారా గ్రామ, జిల్లా స్థాయిలలో గ్రామ పంచాయతీల ద్వారా పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏర్పడింది. ఆ సవరణ 1993 ఏప్రిల్ 24 నుండి అమలులోకి వచ్చింది. 2016 లో పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా ‘గ్రామోదయ్ సే భారత్ ఉదయ్ అభియాన్’ లో భాగంగా జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో జాతీయ సదస్సు జరిగింది. దేశ వ్యాప్తంగా దాదాపు 3000 పంచాయతీ ప్రతినిధులు హాజరైన ఈ కార్యక్రమంలో ఉత్తమ పనితీరు కనబర్చిన పంచాయతీలకు పంచాయత్ శక్తికరణ్ పురస్కార్, ఉత్తమ పనితీరు కనబర్చిన గ్రామ సభలకు రాష్ట్రీయ గౌరవ్ గ్రామసభ పురస్కార్‌లు ప్రదానం చేయబడ్డాయి.
ప్రతి ఏటా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవానికి ఒక థీమ్‌తో ముందుకుపోతూ గ్రామీణ భారత దేశంలోని స్థానిక స్వపరిపాలనాలతో పాటు పంచాయతీలు, గ్రామసభల గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తారు. భారత దేశంలోని పంచాయతీరాజ్ వ్యవస్థ మూడు స్థాయిలుగా విభజించబడింది, ఇందులో గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, ఇంటర్మీడియట్ స్థాయిలో బ్లాక్ పంచాయతీ లేదా పంచాయతీ సమితి, జిల్లా స్థాయిలో జిల్లా పంచాయతీ ఉన్నాయి. ఏప్రిల్ 24 న జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం రోజునా దేశ వ్యాప్తంగా ఉన్న పంచాయతీల దగ్గర ప్రతినిధులు, గ్రామ పెద్దలందరూ కలిసి మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుం ది.

జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం లేదా పంచాయతీ రాజ్ దివాస్ సందర్భంగా గ్రామ ప్రతినిధులు చేసిన పనిని గుర్తించి అభినందిస్తారు. జాతీయ పంచాయతీ రాజ్ డే గురించి తెలుసుకోవాలని, జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ స్వమిత్వా (ఎస్‌విఎఎంఐటివిఎ) (గ్రామాల సర్వే, గ్రామ ప్రాంతాలలో మెరుగైన సాంకేతిక పరిజ్ఞానంతో మ్యాపింగ్) ప్రారంభించారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం దేశ వ్యాప్తంగా ఎస్‌విఎఎంఐటివిఎ పథకం, కాపీ టేబుల్ పుస్తకాన్ని విడుదల చేస్తుంది.
మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ 2010లో మొదటి జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని ప్రకటించారు. 1993 లో 73 వ రాజ్యాంగ సవరణ పంచాయతీ రాజ్ వ్యవస్థను సంస్థాగతీకరిస్తూ అమల్లోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గాంధీ ఆశయాలకు అనుగుణంగా పల్లెలను అభివృద్ధి పథంలో తీసుకుపోతూ తాండాలను పంచాయతీలుగా చేసి అన్ని విధాలుగా మార్పులు చేర్పులు చేస్తూ ఉత్తమ గ్రామ పంచాయతీలు అంటే తెలంగాణలోనే అధికంగా ఉన్నాయి అనే విధంగా సంబంధింత అధికారులను, ప్రజా ప్రతినిధులను పరుగులు పెట్టిస్తూ వారి విశేషమైన కృషి ఫలితమే ఈ మధ్యన ప్రకటించిన 46 కేంద్ర ప్రభుత్వ అవార్డులలో 13 అవార్డులు మన రాష్ట్రానికే రావడం జరిగింది. గ్రామ స్థాయిలో అమల్లో ఉండే అతి ప్రాచీన పాలనా వ్యవస్థ పంచాయతీ. దీనినే స్థానిక స్వపరిపాలనా సంస్థల వ్యవస్థ, పంచాయతీ రాజ్ వ్యవస్థ అని కూడా అంటారు. గ్రామ రాజ్యం ద్వారా రామరాజ్యం ఏర్పాటు చేయాలని గాంధీజీ కలలు కన్నారు. ఆయన దృష్టిలో ప్రతి గ్రామ పంచాయతీ ఒక చిన్న గణతంత్ర రాజ్యం. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు, దేశాభివృద్ధికి మూలం.
గ్రామాభివృద్ధి కోసమే గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి వాటికి పూర్తి అధికారాలు ఇవ్వడానికి రాజ్యాంగం ప్రాధాన్యం కల్పించింది. పంచాయతీ రాజ్ వ్యవస్థలో గ్రామాల అభివృద్ధికి ఆ గ్రామ ప్రజలే దిక్సూచి. ప్రాచీన కాలంలో పని చేస్తున్న గ్రామ పాలన వ్యవస్థ అప్పటి సాంఘిక పరిస్థితులకు అనుగుణంగా అయిదు ప్రధాన వృత్తుల ప్రతినిధులతో పని చేసేది. అయితే ఇది ఎక్కువగా అణచివేతకు గురయ్యేది. బ్రిటిష్ పాలన ప్రారంభంలో గ్రామ పాలన అంతగా ఆదరణకు నోచుకోలేదు. అప్పటి జనరల్ గవర్నర్ ‘రిప్పన్’ ప్రోత్సాహంతో స్థానిక స్వపరిపాలనా సంస్థలు పునరుజ్జీవనం పోసుకున్నాయి. 1919, 1935 భారత ప్రభుత్వ చట్టాల వల్ల కొంత మేరకు వీటికి మేలు జరిగింది. ఇండియాలో మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను ప్రారంభించిన మొదటి రాష్ట్రం రాజస్థాన్ కాగా, ఆంధ్రప్రదేశ్ రెండోది, 1959 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో ఈ వ్యవస్థను ప్రారంభించారు. 73 వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1994లో కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని చేసింది.
ప్రస్తుత వ్యవస్థ దీనికి అనుగుణంగా ఉంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ రాష్ట్రాల మంత్రిత్వ శాఖలతో దీనికి సంబంధించిన కార్యక్రమాలను చేపడుతుంది. దాదాపు 30 లక్షల మంది ప్రజాప్రతినిధులతో నడుస్తున్న పంచాయతీ రాజ్ వ్యవస్థ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. పంచాయతీ రాజ్ వ్యవస్థ వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కొంత ఉపశమనం లభిస్తుంది. ప్రజా సమస్యలపై స్పందిస్తూ దేశానికి గ్రామాలు వెన్నెముకలా పని చేస్తున్నాయి. పంచాయతీరాజ్ ముఖ్య ధ్యేయం వికేంద్రీకరణ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీల అభివృద్ధికి కృషి చేసి మహాత్ముడి ఆశయాలు నెరవేరుస్తాయని ఆశిస్తున్నాము.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News