Sunday, April 28, 2024

పార్టీ మార్పు వదంతి మీడియా సృష్టి: కమల్ నాథ్

- Advertisement -
- Advertisement -

ఛింద్వారా: అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి)లోకి తాను ఫిరాయించగలనని ఊహాగానాలను మీడియా సృష్టించిందని, తాను ఎన్నడూ అటువంటి ప్రకటన చేయలేదని 77 ఏళ్ల కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ మంగళవారం స్పష్టం చేశారు. మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ రాష్ట్రంలోని స్వస్థలం ఛింద్వారా చేరుకున్న తరువాత విలేకరులతో మాట్లాడుతూ ఆ విషయం చెప్పారు. కమల్ నాథ్ బిజెపిలోకి మారే ఆలోచన ఏదీ లేదని ఆయన సహచరులు, దిగ్విజయ్ సింగ్, జితేంద్ర సింగ్ వంటి పార్టీ సీనియర్ నేతలు పదే పదే హామీ ఇచ్చినప్పటికీ ఆయన బిజెపిలో చేరబోతున్నారంటూ ముమ్మరంగా ఊహాగానాలు సాగాయి.

పార్టీ మార్పు గురించి విలేకరులు ప్రశ్నించినప్పుడు, ‘మీరు (మీడియా) అటువంట ఊహాగానాలు లేవదీస్తున్నారు. ఆ విధంగా వేరే ఎవ్వరూ చెప్పడం లేదు. నా నుంచి మీరు ఎప్పుడైనా విన్నారా? మీరు వార్తలు రాసి, నన్ను అడుగుతారు& మీరు ఈ వార్తను ఖండించాలి’ అని కమల్ నాథ్ సమాధానం ఇచ్చారు. బిజెపికి కమల్ నాథ్ అవసరం లేదని, ఆయనకు పార్టీ తలుపులు మూసి ఉన్నాయని మధ్య ప్రదేశ్ మంత్రి కైలాస్ విజయ్‌వర్గీయ ఇటీవల స్పష్టం చేయడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News