Wednesday, May 8, 2024

కులగణనపై పాట్నా హైకోర్టు స్టే..

- Advertisement -
- Advertisement -

పాట్నా: బీహార్‌లో నిర్వహిస్తున్న కులగణనపై పాట్నాహైకోర్టు గురువారం స్టే విధించింది. తక్షణమే సర్వేను నిలిపేయాల్సిందిగా కుమార్ ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇంతవరకూ ప్రభుత్వం కులగణన సర్వేలో సేకరించిన డేటాను భద్రపరచాల్సిందిగా పాట్నా కోరింది. సర్వేకు వ్యతిరేకంగా దాఖలైన రిట్ పిటిషన్‌ను విచారించిన ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. తుదితీర్పు వెలువడేవరకూ సేకరించిన డేటాను ఎవరికీ షేర్ చేయవద్దని ఆదేశాల్లో పేర్కొంది.

ఈ మేరకు చీఫ్ జస్టిస్ కే వినోద్ చంద్రన్, జస్టిస్ మధురేశ్ ప్రసాద్‌తో కూడి డివిజన్ బెంచ్ నితీశ్ సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. గోప్యత హక్కును రాష్ట్రప్రభుత్వం విస్మరించిందని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని మందలించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News