Saturday, April 27, 2024

వీరి ఫ్రెండ్‌షిప్ సీక్రెట్ అదే

- Advertisement -
- Advertisement -

Pawan presented special memento 'Mahaprasthanam' to Trivikram

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య ఉండే సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల విషయంలోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఇద్దరూ చాలా సన్నిహితంగా ఉంటారని ఇండస్ట్రీలో అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అయితే వీరిద్దరి మధ్య ఇంత అనుబంధం ఏర్పడటానికి కారణం ఏంటి? అసలు ఇద్దరు కలిసినప్పుడు ఏమి మాట్లాడుకుంటారు? అని తెలుసుకోవాలనే ఆసక్తి సినీ అభిమానుల్లో ఉంది. పవన్ సినిమాలతో పాటుగా రాజకీయాల్లో కూడా ఉన్నారు కాబట్టి.. త్రివిక్రమ్ కలిసినప్పుడు ఈ రెండింటి గురించే చర్చించుకుంటారని అందరూ అనుకుంటుంటారు. అయితే సినిమాల కంటే కూడా సాహిత్యం, – పుస్తకాల గురించి తరచూ ఇరువురు చర్చించుకుంటారని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. వీరి ఫ్రెండ్‌షిప్ సీక్రెట్ కూడా ఇదే. దీనికి ఉదాహరణగా చెప్పుకొనే సందర్భం ఒకటి జరిగింది. ప్రస్తుతం ’భీమ్లా నాయక్’ షూటింగ్‌లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్‌ను త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిశారు.

సాహిత్య ప్రియులైన వీరిద్దరూ మహాకవి శ్రీశ్రీ రచనల గురించి.. ఆయన కలం నుంచి జాలువారిన ‘మహా ప్రస్థానం’ గురించి చర్చించుకున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీశ్రీ చేతిరాతతో ఉన్న ‘మహా ప్రస్థానం’ ప్రత్యేక స్మరణికను త్రివిక్రమ్‌కు బహుమతిగా అందచేశారు పవన్. ‘మహా ప్రస్థానం’ పుస్తక ముద్రణ గురించి, అందులోని అరుదైన చిత్రాల గురించి ఇద్దరూ మాట్లాడుకున్నారు. త్రివిక్రమ్ ఈ సందర్భంగా పవన్‌తో శ్రీశ్రీ గురించి చెబుతూ.. “శ్రీశ్రీ వేసిన ఒక అడుగు.. రాసిన ఒక పుస్తకం.. ఒక శతాబ్దం మొత్తం మాట్లాడుకుంటుంది.. చాలా శతాబ్దాలపాటు మాట్లాడుకొంటూనే ఉంటుంది. శ్రీశ్రీ తెలుగువారు గర్వించదగ్గ కవి.. ఈ శతాబ్దం నాది అని గర్వంగా చాటిన వ్యక్తి. ఆయన తాలూకు జ్ఞాపకం మనజాతి పాడుకొనే ఒక గీతం. తెలంగాణ విమోచన దినోత్సవం రోజున ఆయన పుస్తకం చూడడం నిజంగా గొప్ప విషయం. ఆయన ఆత్మ ఎక్కుడున్నా స్వాతంత్య్రం అనే సరికి అక్కడికి వచ్చి ఆగుతుంది” అని అన్నారు. దీనికి పవన్ కూడా తనదైన శైలిలో స్పందించారు. ఇక పవన్ కళ్యాణ్ చేస్తున్న ’భీమ్లా నాయక్’ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News