Sunday, April 28, 2024

వచ్చే వారం పెట్రో వాత

- Advertisement -
- Advertisement -

Petrol And diesel price hikes likely to resume next week

రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే పెరిగే అవకాశం
జెపి మోర్గాన్ నివేదిక

న్యూఢిల్లీ : దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వారం ముగియనున్న నేపథ్యంలో పెట్రోలు, డీజిల్ ధరలు వచ్చే వారం పెరిగే అవకాశముంది. మరోవైపు ఉక్రెయిన్ష్య్రా యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ రేటు 110 డాలర్లకు చేరింది. చమురు కంపెనీలు సాధారణ మార్జిన్ సాధించడానికి పెట్రోల్ ధరలను లీటరుకు రూ.9 పెంచాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు నష్టాన్ని భర్తీ చేసుకునే పనిలో నిమగ్నమయ్యాయని బ్రోకరేజ్ కంపెనీ జెపి మోర్గాన్ తన నివేదికలలో తెలిపింది. రష్యా నుంచి చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్న భయాలు నెలకొనగా, దీంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 2014 తర్వాత తొలిసారిగా బ్యారెల్‌కు 110 డాలర్లకు పెరిగాయి.

పెట్రోలియం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే పిపిఎసి(పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్) ప్రకారం, భారతదేశం కొనుగోలు చేసే ముడి చమురు ధర మార్చి 1న బ్యారెల్ 102 డాలర్లు దాటింది. 2014 ఆగస్టు తర్వాత ఇంతటి స్థాయికి పెరగడం ఇప్పుడే. గత ఏడాది నవంబర్‌లో పెట్రోలు, డీజిల్ ధరలు నియంత్రించడంతో ముడి చమురు ధర బ్యారెల్ 81.5 డాలర్ల వద్ద ఉంది. జె.పి.మోర్గాన్ నివేదిక ప్రకారం, వచ్చే వారం నాటికి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగుస్తాయి. దీని తర్వాత ఇంధన ధరలు రోజు వారీగా పెరిగే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్‌లో ఏడో, చివరి దశ పోలింగ్ మార్చి 7న జరగనుంది. ఉత్తరప్రదేశ్‌తో పాటు మొత్తం ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు మార్చి 10న నిర్వహిస్తారు.

చమురు కంపెనీలకు భారీ నష్టం

ప్రభుత్వరంగ చమురు సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియంలు పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.5.7 చొప్పున చెల్లించి నష్టాలను చూస్తున్నాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరిగే యుద్ధం ఆసియాలోని భారత్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. జెపి మోర్గాన్ ప్రకారం, చమురు మార్కెటింగ్ కంపెనీలు సాధారణ మార్కెటింగ్ లాభాలను సాధించడానికి రిటైల్ ధరలను లీటరుకు రూ. 9 లేదా 10 పెంచాలి. దేశీయ ఇంధన ధరలు వరుసగా 118 రోజులుగా మారలేదు. క్రూడ్ ఆయిల్‌లో ప్రతి డాలర్ పెరుగుదల రిటైల్ ధరను 70 నుండి 80 పైసలు ప్రభావితం చేస్తుంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగానే చమురు కంపెనీలు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచున్నాయి. రష్యా-, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ముడిచమురు రేట్లు మరింత పెరగొచ్చు. దీని వల్ల భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోయే అవకాశముంది.

క్రూడ్ బ్యారెల్‌కు 113 డాలర్లు

ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తూ ఎవరినీ లెక్కచేయని రష్యాకు చెందిన బ్యాంకులపై అనేక ఆంక్షలు విధించడంతో చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఆయిల్ మార్కెట్లు ప్రత్యామ్నాయ మార్గాల వైపు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్ 8 డాలర్లు పెరిగి బ్యారెల్‌కు 113.02 డాలర్లకు చేరింది. 2014 సంవత్సరం తర్వాత ఇంత భారీగా రేటు పెరగడం ఇదే. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్‌మీడియట్(డబ్లుటిఐ) క్రూడ్ ఫ్యూచర్ కూడా 8 డాలర్లు పెరిగి, 2013 ఆగస్టు తర్వాత అత్యంత గరిష్ఠానికి చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News