Friday, May 3, 2024

సెంచరీ దాటిన పెట్రోల్ ధర

- Advertisement -
- Advertisement -

Petrol Price crosses 100 in Hyderabad City

ప్రస్తుతం రూ. 100.20లకు చేరుకున్న పెట్రోల్
ధరల పెంపు ఆవేదన వ్యక్తం చేస్తున్న ద్విచక్ర వాహనదారులు

మన తెలంగాణ, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ నగరంలో పెట్రోల్ ధర సెంచరీ దాటి కొత్త రికార్డు నమోదు చేసుకుంది. రోజు రోజుకు ధరలు పైకి ఎగబాకి వాహనదారులకు భారంగా మారింది. గడిచిన 40 రోజులుగా చమురు కంపెనీలు ధరలు పెంచుతూ సోమవారం పెట్రోల్, డీజిల్‌పై మరో 29 పైసలు నుంచి 31 పైసలు పెంచాయి. ప్రస్తుతం నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.20 పైసలకు చేరింది. దీంతో నగరవాసులకు ప్రజా రవాణా మార్గలైన ఆర్టీసీ, మెట్రో రైల్‌పై వివిధ ప్రాంతాలకు వెళ్లతప్పకదంటున్నారు.

రాబోయే రోజుల్లో పెట్రోల్ పేదల కొనుగోలు చేయడం కష్టంగా మారుతుందని పలువురు ద్విచక్ర వాహనదారులు పేర్కొంటున్నారు. లాక్‌డౌన్ కారణంగా ప్రైవేటు రంగంలో ఉద్యోగుల వేతనాల్లో కోత పెట్టడంతో ముందు రోజుల్లో వాహనాలు అత్యవసర పరిస్దితుల్లో వినియోగించే పరిస్దితి ఉంటుందని పేర్కొంటున్నారు. నగరంలో రోజుకు 55లక్షల నుంచి 60లక్షల వాహనాలు రోడ్లపై తిరుగుతున్నారు. గత వారం రోజుల లాక్‌డౌన్ సడలింపు ఉండటంతో ఆటోలు, ట్యాక్సీలు నడుస్తుండటంతో ఇంధనం వాడకం కొద్దిగా పెరిగిందని, ఇకా చమురు ధరలు పెరిగితే పరిమితంగా వాహనాలు రోడ్లపై వాతావరణం ఉంటుందని పెట్రోల్ బంక్ యాజమానులు భావిస్తున్నారు.

చమురు ధరలను పెంపు సరికాదు : ద్వి చక్ర వాహనదారులు

నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలతో తాము సంపాదించే ఆదాయంలో సగం వాహనాలకు ఖర్చు చేయాల్సి వస్తుందని పలువురు ద్విచక్ర వాహనదారులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఆర్దిక సమస్యలు ఉంటంతో పెట్రోల్ ధరలు పెరగడం బాధకరమంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చమురు ధరల విషయంలో ఆలోచించి తగ్గించే విధంగా చూడాలని కోరుతున్నారు.

గత వారం రోజులుగా పెట్రోల్ ధరలు చూస్తే……

తేదీ                  ధర

7న               99.12
8న               99.06
9న               99.31
10న             99.31
11న             99.62
12న             99.90
13న             99.90
14న            100.20

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News