Saturday, April 27, 2024

నగరంలో రూ.6.29 తగ్గిన పెట్రోల్ ధర

- Advertisement -
- Advertisement -

Petrol price reduced in Hyderabad

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రోల్‌పై రూ.5, డీజిల్ పై రూ.10 ఎక్సైజ్ డ్యూటిని తగ్గించడంతో దేశవ్యాప్తంగా చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై రూ.6.29 తగ్గుదల నమోదైంది. డీజిల్‌పై రూ.12.78 తగ్గింది. శుక్రవారం నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.18 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. ప్రస్తుతం చమురు ధరలు స్వల్పంగా తగ్గినా త్వరలోనే మళ్లీ పెరిగే వీలుందని రాష్ట్ర పెట్రోల్ డీలర్ల సమాఖ్య ప్రతినిధులు తెలిపారు. కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించినందుకు ధరలు స్వల్పంగా తగ్గినా.. క్రూడాయిల్ ధరలు పెరగడంతో మరి కొద్ది రోజుల్లో ధరలు పెరుగుతాయని వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడాయిల్ ధర రూ.81.36 అమెరికన్ డాలర్‌లు పలుకుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News