Thursday, May 2, 2024

పెట్రో ఎఫెక్ట్.. పడిపోయిన వాహనాల అమ్మకాలు

- Advertisement -
- Advertisement -
Petrol prices impact on vehicle sales
లైఫ్ ట్యాక్స్,ఫ్యాన్సీ నెంబర్ల రూపంలో వచ్చే ఆదాయం కోల్పోతున్న రవాణాశాఖ

హైదరాబాద్: ఆగకుండా పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు వాహనాల అమ్మకాలపై తీవ్ర ప్రభవాన్ని చూపుతున్నాయి. వాహన కోనుగోళ్ళ కోసం ముందుగా బుక్ చేసుకున్న వినియోగదారులు తమ బుకింగ్‌లను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. మరి కొంత మంది వాహనాలను కొనాలనుకున్నా వారు సైతం తమ ఆలోచన మార్చుకుని సెకండ్ హ్యాండ్ వాహాలనపై దృష్టి సారిస్తున్నారే కానీ కొత్త వాహనాలను కొనుగోల చేసేందుకు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. దీంతో రవాణశాఖకు వాహనాల మీద లైఫ్ ట్యాక్స్, ఫ్యాన్సీ నంబర్ల రూపంలో వచ్చే ఆదాయం కూడా తగ్గిపోయింది. రవాణాశాఖకు వాహన బిల్లు మీద (ఇన్వాయిస్ పై) 9 శాతం లైఫ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. సదరు వాహన దారునికి రెండో వాహనం కూడా ఉన్నట్లయితే 14 శాతం వరకు లైఫ్ ట్యాక్స్ రూపంలో చెల్లించాల్సి వచ్చింది.

ఉదాహరణకు రూ. 6 లక్షల ఖరీదు చేసే వాహనపై 9 శాతం లైఫ్‌ట్యాక్స్ ద్వారా రవాణశాఖకు రూ.54 వేల ఆదాయం వచ్చేది. అదే 14 శాతం వేసుకుంటే రూ. 84 వేల వరకు ఆదాయం వస్తుంది. ఈ విధంగా షోరూంలలో వాహనాలు అమ్మకాలు సాగక పోవడంతో రవాణశాఖ లైఫ్ ట్యాక్స్ రూపంలో పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోతుంది. పెట్రోల్ ధరలు సాధారణ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రతి రోజు ఒక్కో షోరూంలో 50 నుంచి 75 వరకు వాహనాలు అమ్మడుపోయేవి. కానీ పెట్రోలు ధరలు అంతు లేకుండా సుమారు లీటర్ పెట్రోల్ రూ.106.చేరుకోవడం, భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉండటంతో నూతన వాహనాల కొనుగోళ్ళపై ఆసక్తి చూపడం లేదని యమాహా షోరూం మేనేజర్ వినయ్ కుమార్ రెడ్డి తెలిపారు. పెట్రోల్ ధరల పెరుగుదలతో రోజుకు ఒకటి, రెండు వాహనాల కంటే అధికంగా అమ్మలేక పోతున్నామని షోరూం నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షోరూంలకు నెలకు లక్షల్లో అద్దె చెల్లించాల్సి వస్తోందని ఇప్పుడు వాటిని చెల్లించలేక మరో సిబ్బందికి వేతనాలు చెల్లించలేక నిర్వాహణ వ్యకం కష్టంగా మారడంతో షోరూంలను మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు.

ప్రస్తుతం వినియోగదారులు వాహనాల కొనుగోలు విషయంలో ఆచితూచి అడుగు వేస్తున్నారని, అంతే కాకుండా వాహనాల కోనుగోళ్ళకు ఫైనాన్స్ సంస్థలు కూడా ఫైనాన్స్ చేసేందుకు ముందుకు రావడం లేదని చెబుతున్నారు. గతంలో సదరు షోరూంలలో వాహనాలు కోనగోలు చేసిన వారు ఆయా వాహాలు సర్వీసులకు ఇస్తుండటంతో దాని మీద వచ్చే ఆదాయంతో కష్టంగా షో రూంలను నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. ఆటోమోబైల్ తయారీదారులు వాహనాలు అమ్మినందుకు ప్రతి వాహనంపై 5 శాతం కమిషన్ ఇస్తారని, ప్రస్తుత పరిస్థితుల్లో అది మాకు ఏ మాత్రం పరిపోదని దీంతో సదరు వాహన తయారీదారులు తమకు ఇచ్చే కమిషన్‌ను 7 శాతం పెంచాలని ఇప్పటికే ఆటోమోబైల్ డీలర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. వాహన తయారీదారుల నుంచి సానుకూలంగా సమాధానం వస్తే కొంత మేరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతామని చెబుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News