Saturday, April 27, 2024

ఈ ఏటా ఖైరతాబాద్‌ గణేశుడు రూపం ఇదే..

- Advertisement -
- Advertisement -

Khairatabad Ganesh Statue Model released

 

హైదరాబాద్‌ : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం తయారీ పనులు గత వారం క్రితం ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఖైరతాబాద్‌ గణేశ్‌ విగ్రహ నమూనాను ఉత్సవ కమిటీ ఈరోజు ఆవిష్కరించింది. ఈ ఏడాది పంచముఖ రుద్ర మహాగణపతిగా భక్తులకు ఖైరతాబాద్‌ గణనాథుడు దర్శనమివ్వనున్నాడు. మండపంలో గణనాథుడికి ఎడమ వైపు కాలనాగదేవత, కుడివైపు కాలవిష్ణు విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు. ఇరువైపులా కృష్ణకాళి, కాళనాగేశ్వరిమూర్తుల విగ్రహాలు ఏర్పాటు చేయనున్నట్లు ఉత్సవ కమిటీ వెల్లడించింది. ఈ సారి 40 అడుగుల విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. గత సంవత్సరం కరోనా నేపథ్యంలో భక్తులకు దూరం నుంచే నిర్వాహకులు దర్శనభాగ్యం కల్పించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News