Monday, April 29, 2024

2022 నాటికి సరిహద్దు కంచెల్లోని ఖాళీలను పూరిస్తాం

- Advertisement -
- Advertisement -
All gaps on India’s border fences will be covered by 2022
అమిత్ షా ప్రకటన

న్యూఢిల్లీ: సంపూర్ణ భద్రతను కల్పించే చర్యలలో భాగంగా వచ్చే ఏడాది కల్లా దేశ సరిహద్దుల కంచెల్లోని అన్ని ఖాళీలను పూరిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి రాక ముందు వరకు దేశానికి ఒక జాతీయ భద్రతా విధానమంటూ ఏదీ లేదని, ఇప్పుడు శత్రువును సమర్థంగా తిప్పికొట్టగల సామర్ధాన్ని సంపాదించుకున్నామని ఆయన వ్యాఖ్యానించారు.

శనివారం ఇక్కడి విజ్ఞాన్ భవన్‌లో బిఎస్‌ఎఫ్ నిర్వహించిన ఇన్వెస్టిచర్ ఉత్సవంలో రుస్తంజీ స్మారకోపన్యాసం అందచేస్తూ సరిహద్దుల కంచెలలో ఖాళీలు ఉండాలని ఎవరూ కోరుకోరని, అయితే 200 కిలోమీటర్ల పొడవైన కంచెలో 1.5 కిలోమీటర్ల ఖాళీని విడిచిపెడితే ఆ మొత్తం కంచె నిర్మాణమే వృథా ప్రయాస అవుతుందని అభిప్రాయపడ్డారు. సరిహద్దుల కంచెల మధ్య ఏర్పడిన ఖాళీలను పూరించడంపై పరిపాలనా స్థాయిలో అడ్డంకులను తొలగించడంతోపాటు పొరుగుదేశాలతో కూడా మాట్లాడామని ఆయన చెప్పారు. అన్ని అవరోధాలు తొలగిపోవడంతో 2022 కల్లా కంచెలలో ఏర్పడిన అన్ని ఖాళీలను పూరిస్తామని ఆయన చెప్పారు.

All gaps on India’s border fences will be covered by 2022

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News