Sunday, April 28, 2024

దీర్ఘకాలిక కోవిడ్ వీడినా ..వీడని జబ్బులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దీర్ఘకాలిక కోవిడ్ సోకి కోలుకున్న వారిలో అత్యధికులకు ఆ తరువాత రకరకాల అనంతర శారీరక అనారోగ్యాలు తలెత్తుతున్నాయి. ఇవి కేవలం కోవిడ్ సమస్యలే అని , ఇవి కోవిడ్ వచ్చిన రెండేళ్లకు తలెత్తుతుంటాయని నిర్థారించారు. కోవిడ్ సోకి నయం అయిన వారిపై జరిపిన శాంపుల్ సరేవ క్రమంలో వెలుగులోకి వచ్చిన అంశాలను ఇప్పుడు లాన్సెట్ వైద్య విజ్ఞాన పత్రికలో ప్రచురించారు. చాలా మందిలో కోవిడ్ తగ్గుతుంది కానీ దీనితో తలెత్తే శారీరక అవలక్షణాలు రెండేళ్ల పాటు ఉనికిలోనే ఉంటాయని అధ్యయనంలో తేల్చారు. ఏడు రోజుల పాటైనా కోవిడ్ సోకిన వారిలో ఈ దీర్ఘకాలిక సమస్యలు ఉంటూ వస్తున్నాయి. వీరిలో కనీసం 37 శాతం మంది వరకూ శ్వాస సరిగ్గా పీల్చుకోలేకపోవడం, ఛాతీనొప్పి, మగత, తలనొప్పి , నీరసం వంటి అవలక్షణాలు ఎదురవుతున్నాయి. స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇనిస్టూట్ పరిశోధకులు జరిపిన అధ్యయనం కోవిడ్ గాయాలను విశ్లేషించింది.

వయో, లింగ భేదాలు లేకుండా ఈ దీర్ఘకాలిక కోవిడ్ సమస్యలు తలెత్తుతున్నట్లు వెల్లడైంది. చాలా మందిలో కరోనా వచ్చిందనే భయాందోళనలు, ఏమవుతుందో అనే కంగారు ఇటువంటి అనారోగ్యాలకు దారితీస్తోంది. అయితే ఇటువంటి భయాలు లేని వారిలోనే ఎక్కువగా కోవిడ్ అనంతర సమస్యలు తలెత్తడం సమస్యను మరింత సంక్లిష్టం చేసింది. ఇప్పుడు దీర్ఘకాలిక కోవిడ్ నిర్థిష్టంగా ఓ ప్రధాన ఆరోగ్య సమస్యగా మారిందని , కోవిడ్ వైరస్‌లు పూర్తి స్థాయిలో అంతరించిపొయ్యే వరకూ దీనిని వ్యాధుల జాబితాలోనే చేర్చి ఉంచాల్సి ఉంటుందని కోవిడ్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) వెలువరించిన వాస్తవాలపట్టికలో తెలిపారు. కోవిడ్ సోకిన వారికి కనీసం రెండేళ్ల పాటు శారీరక పరీక్షలు తరచూ నిర్వహిస్తూ ఉండాల్సిందే. ప్రత్యేకించి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారికి ఇది వీడని అనారోగ్య సమస్యగానే నిలుస్తుందని నిపుణులు హెచ్చరించారు. ప్రత్యేకించి తీవ్రస్థాయిలో కోవిడ్ వచ్చి క్రమేపీ నయం అయిన వారిపై ఎక్కువగా దృష్టి సారించాల్సి ఉంటుందని పరిశోధనల క్రమంలో వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News