Saturday, April 27, 2024

వ్యాక్సినేషన్ పాలిటిక్స్..

- Advertisement -
- Advertisement -

PM celebrated his birthday every day said Congress

ప్రధాని మోడీ ప్రతిరోజూ
పుట్టినరోజు జరుపుకోవాలి: కాంగ్రెస్ ఎద్దేవా
ఆ పార్టీకి సైడ్ ఎఫెక్ట్‌గా జ్వరం: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ ప్రతిరోజూ తన పుట్టినరోజు జరుపుకోవాలని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. ప్రధాని పుట్టిన రోజున రికార్డు స్థాయిలో 2.5 కోట్ల కొవిడ్19 వ్యాక్సినేషన్ నిర్వహించడాన్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్ విమర్శలు చేసింది. బిజెపి పాలిత రాష్ట్రాల్లో రోజువారీ సగటుకన్నా ఎన్నో రెట్లు వ్యాక్సినేషన్‌ను మోడీ పుట్టినరోజున నిర్వహించడంపై కాంగ్రెస్ నేతలు తమ వ్యాఖ్యల్ని పోస్ట్ చేశారు. కాంగ్రెస్ విమర్శలకు ప్రధాని మోడీ కౌంటరిచ్చారు. వ్యాక్సిన్ల విషయంలో జ్వరంలాంటి సైడ్ ఎఫెక్ట్ గురించి విన్నాను. తన పుట్టినరోజున 2.5 కోట్ల వ్యాక్సినేషన్ జరగడం వల్ల ఓ రాజకీయ పార్టీకి జ్వరం పట్టుకున్నదని ప్రధాని కౌంటరిచ్చారు. దేశ అవసరంరీత్యా 2.1 కోట్ల వ్యాక్సినేషన్‌ను మరిన్ని రోజులు కొనసాగించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ట్విట్ చేశారు.

శుక్రవారం 2.5 కోట్ల వ్యాక్సినేషన్ నిర్వహించినందుకు కృతజ్ఞతలు చెబుతున్నానని కాంగ్రెస్ సీనియర్‌నేత పి.చిదంబరం ట్విట్ చేశారు. అయితే, ప్రధాని మోడీ పుట్టినరోజుదాకా ఎందుకు ఆగారని ఆయన ప్రశ్నించారు. ఓవేళ ప్రధాని పుట్టినరోజు డిసెంబర్ 31న ఉంటే అప్పటిదాకా ఆగేవారా అని ఆయన ప్రశ్నించారు. వ్యాక్సినేషన్ అనేది పుట్టినరోజున కేక్ కట్ చేయడంలాంటిది కాదని ఆయన అన్నారు. ప్రధాని ప్రతిరోజూ పుట్టినరోజు జరుపుకోవాలని తాను కోరుతున్నానని ఆయన ట్విట్ చేశారు. దేశంలోని వృద్ధుల్లో మూడోవంతుకు మాత్రమే వ్యాక్సినేషన్ ఒక్క డోస్ పూర్తయిందని, 21 శాతంమందికి రెండు డోసులిచ్చారని చిదంబరం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News