Thursday, May 2, 2024

అవినీతి సంపద స్వాధీనానికి సమిష్టి చర్యలు

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : అవినీతి, నేరపూరిత చర్యలతో సమకూరే విదేశీ సంపద స్వాధీనానికి జి20 దేశాలు చొరవ చూపాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ శనివారం జి 20 అవినీతి నిరోధక మంత్రిత్వశాఖల సమావేశాన్ని ఉద్ధేశించి ప్రసంగించారు. దోష నిర్థారణ ప్రక్రియలతో నిమిత్తం లేకుండా ముందు నేరపూరిత చర్యల సంపాదనపరుల ఆస్తులను కట్టడి చేయాల్సి ఉందన్నారు. ఈ విషయంలో జి 20 దేశాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలవాల్సి ఉందన్నారు. అక్రమ సంపాదనలతో విదేశాలలో తిష్టవేసుకునే వారి ఆస్తులను ముందుగా గుర్తించాలి. ఇటువంటి విదేశీ ఆస్తులను సకాలంలో గుర్తించేందుకు తగు యంత్రాంగం ఏర్పాటు చేసుకోవల్సి ఉంది. ఏ విధమైన నేరపూరిత చర్యలకు పాల్పడుతున్నారనేది గుర్తించాలి. దీని వల్ల త్వరితగతిన నేరస్థులపై విచారణలు, వారి అప్పగింతలకు వీలేర్పడుతుందని తెలిపారు. అవినీతి ఏ స్థాయిలో జరిగినా దీని ప్రభావం చివరికి పిడుగుపాటుగా కింది స్థాయి వారిపై అత్యంత నిరుపేదలపై పడుతోంది.

అణగారిన వర్గాలకు చేటుగా మారుతుంది. ఈ రుగ్మతతో వనరుల సద్వినియోగానికి గండిపడుతుంది. మార్కెట్లు చతికిలపడుతాయి. సేవల పంపిణీపై ప్రభావం పడుతుంది. దీనితో చివరికి ప్రజల జీవన ప్రమాణాలకు విఘాతం ఏర్పడుతుందని, దీనిని జి 20 దేశాలు గుర్తించి తగు విధంగా ఈ వ్యవహారాలపై చెక్‌పెట్టాల్సి ఉందన్నారు. నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ టాగూర్ నడయాడిన నగరం కోల్‌కతాకు వచ్చిన అతిధులకు స్వాగతం పలుకుతున్నామని చెప్పిన ప్రధాని ఈ సందర్భంగా విశ్వకవి గేయాలలోని నిత్యసత్యాలను తెలిపారు. ఈర్షాద్వేషాలు సత్యాన్ని ఆకళింపుచేసుకోకుండా అడ్డుతగులుతాయని కవి చెప్పిన మాటలు విశ్వజనీనం అని తెలిపారు. ఉపనిషత్తులలో కూడా ఈ విధమైన సందేశం అంతర్లీనంగా ఉందన్నారు. అర్థశాస్త్రలో కౌటిల్యుడు చెప్పిన మాటలను విశ్లేషిస్తూ ప్రజా వనరులను సరైన విధంగా చివరికి ప్రజల సంక్షేమానికి వినియోగించడమే ప్రభుత్వ లక్షం కావాలని కౌటిల్యుడు సముచితంగా ఆర్థికశాస్త్ర వివరణకు దిగారని తెలిపారు. సద్వినియోగ వనరులతోనే మరింత సముచిత సంపద వృద్ధి సాధ్యం, అక్రమ సంపాదనతో సమకూరే వనరులు అరిష్టాలనే మిగులుస్తాయని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News