Friday, May 3, 2024

పార్లమెంట్‌లో చర్చ కీలకం : ప్రధాని

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తలపెట్టిన బిల్లులపై పార్లమెంటేరియన్లు చిత్తశుద్ధితో కూడిన చర్చ జరపాలని ఉందని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. ప్రజల బాగుకోసం పలు బిల్లులు తీసుకువస్తున్నామని, ప్రజా సంక్షేమం పరిగణనలోకి తీసుకుని ప్రతిపక్షాలు వీటిపై దృష్టి సారించి, చర్చించాల్సి ఉంటుందన్నారు. గురువారం పార్లమెంట్ సెషన్ ఆరంభానికి ముందు ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే పలు బిల్లుల గురించి ప్రస్తావించారు. పలు కీలక రంగాలకు సంబంధించి బిల్లులు వస్తున్నందున వీటిపై ప్రతిపక్షాల నుంచి చర్చలలో సముచిత ప్రాతినిధ్యం ఉండాలని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. బిల్లులపై చర్చ జరిగి అవి ఆమోదం పొందితే తద్వారా దేశ హితం మరింత వేగవంతం అవుతుందన్నారు. డేటా ప్రొటెక్షన్ బిల్లు, జన్‌విశ్వాస్ బిల్లు,నేషనల్ రిసర్చ్ ఫౌండేషన్ బిల్లు వంటి వాటిని ఆయన ప్రస్తావించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News