Thursday, May 2, 2024

పశ్చిమాసియా పరిస్థితిపై యుఎఇ అధ్యక్షుడితో మోడీ చర్చలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం యుఎఇ అధ్యక్షుడు యొహమ్మద్ బిన్ జాయేద్‌తో పశ్చిమాసియాలో పరిస్థితిపై చర్చించారు. ఉగ్రవాదం, ఈ ప్రాంతంలో దిగజారుతున్న భద్రతా పరిస్థితులు, పౌరుల ప్రాణనష్టంపై ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.ఈ ప్రాంతంలో భద్రత, మానవతా పరిస్థితి సమస్యను వీలయినంత త్వరగా పరిష్కారం కనుగొనాల్సిన అవసరంపై తామిరువురమూ అంగీకరించినట్లు ప్రధాని మోడీ ‘ఎక్స్’పోస్టులో తెలిపారు. ఇజ్రాయెల్‌హమాస్ మధ్య భీకర పోరు నేపథ్యంలో ఇరువురు నేతల మధ్య ఈ టెలిఫోన్ సంభాషణ జరిగింది. ఇండియా యుఎఇ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఒప్పందం పరిధిలో వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని కూడా ఇరువురు నేతలు పునరుద్ఘాటించారని ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఓ) ఒక ప్రకటనలో తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News