Thursday, May 2, 2024

అందుబాటు లోకి అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ “యశోభూమి”

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అంతర్జాతీయ సదస్సులు, సమావేశాల కోసం సువిశాల వసతులను కల్పించడంలో భాగంగా ఢిల్లీ లోని ద్వారక ప్రాంతంలో కేంద్రం నిర్మించిన “యశోభూమి” అందుబాటు లోకి వచ్చింది. ఈ ప్రాజెక్టు తొలిదశలో భాగంగా రూ.5400 కోట్లతో నిర్మించిన ఈ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్‌ను ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం ప్రారంభించారు. ప్రాజెక్టు మొత్తం విస్తీర్ణం 8.9 లక్షల చదరపు మీటర్లు కాగా, అందులో 1.8 లక్షల చ.మీ లో నిర్మాణాలు చేపట్టారు. దీనిలో 73 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో యశోభూమి అంతర్జాతయ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారు.

ఇందులో ప్రధాన ఆడిటోరియంతోపాటు 15 సమావేశ గదులు ఉన్నాయి. మొత్తం ఎనిమిది అంతస్తుల్లో 13 సమావేశ గదులు, అతిపెద్ద బాల్‌రామ్‌ను సిద్ధం చేశారు. మొత్తంగా ఇందులో 11 వేల మంది ప్రతినిధులు సమావేశం కావచ్చు. ప్రధాన ఆడిటోరియంలో 6 వేల మంది కూర్చొనే వెసులు బాటు ఉంది. గ్రాండ్ బాల్‌రూమ్‌లో 2500 మంది అతిధులు కూర్చోవచ్చు. ఇక్కడ దేశం లోని అతిపెద్ద ఎల్‌ఈడీ మీడియా ప్రచార వేదిక ఉంది. అవసరానికి అనుగుణంగా సీటింగ్ క్రమాన్ని మార్చుకోవడం , వాటి సంఖ్యను పెంచుకునే అవకాశం ఈ ఆడిటోరియంలో ఉండటం విశేషం. యశోభూమి నుంచి ద్వారకాలోని ఢిల్లీ ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ లైనుకు చేరుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News