Thursday, May 2, 2024

అమెరికాలో మోడీ జోష్…హోష్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ / హూస్టన్ : అమెరికాలో బుధవారం నుంచి ప్రధాని మోడీ నాలుగురోజుల అధికారిక పర్యటనపై అక్కడి భారతీయ సంతతి అమెరికన్లలో ఉత్సాహం పెల్లుబుకుతోంది. ప్రెసిడెంట్ జో బైడెన్ దంపతుల వ్యక్తిగత ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ ఈ నెల 21 నుంచి 24 వరకూ అమెరికాలో పర్యటిస్తారు. భారత ప్రధాని వస్తున్నందున ఆయనను చూడాలని, వీలైతే ఏదో ఓ సందర్భంలో ఇంటరాక్ట్‌లో మాట్లాడాలని అమెరికాలోని భారతీయ సంతతి వర్గాలు ఆశిస్తున్నాయి. ప్రత్యేకించి భారతదేశం నుంచి అమెరికాకు చాలా కాలం క్రితమే వచ్చి వివిధ రంగాలలో స్థిరపడ్డ వారు, భారతీయ సమాజం సంస్థలను ఏర్పాటు చేసుకుని , వాటికి సారధ్యం వహిస్తున్న వారు మోడీ పర్యటన పట్ల ఆకర్షితులు అయ్యారు. అమెరికాలో పలు ప్రాంతాలలో ప్రత్యేకించి భారతీయ సంతతి ఎక్కువగా ఉండే చోట్ల మోడీ క్రేజ్ నెలకొంది.

వందలాది ఇండో అమెరికన్లు అమెరికా వ్యాప్తంగా 20 నగరాలలో ప్రదర్శనలు నిర్వహించారు. పలు చోట్ల మరో రెండు రోజులలో వీటిని పెద్ద ఎత్తున చేపట్టేందుకు సన్నాహాలు చేపట్టారు. అమెరికా గుర్తుకు వచ్చేలా నిలిచే అందరికి అమెరికాను తలపించే నగరాలలో మోడీ కటౌట్లు, ప్రధాన కూడళ్లల్లో కొన్ని చోట్ల సభలు చేపట్టారు. ఐక్యతా ర్యాలీలు, ప్రధాని మోడీకి స్వాగత సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. 21వ తేదీన అంతర్జాతీయ యోగాదినోత్సం ప్రధాన ఘట్టం జరిగే న్యూయార్క్‌లోని ఐరాస కార్యాలయం వద్ద ప్రధాని ఈ కార్యక్రమంలో విశిష్ట అతిధిగా ఉంటారు. ఈ నెల 22న ప్రధాని మోడీ గౌరవార్థం బైడెన్ దంపతులు శ్వేతసౌథంలో విందు ఏర్పాటు చేశారు. ఈసారి ప్రధాని మోడీ అదే రోజున అమెరికా చట్టసభల సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు. ఈ నెల 23న ఆహ్వానితులైన వేయి మందితో కూడిన సభలో వాషింగ్టన్ డిసిలో ఆయన భారతీయ సంతతి వారిని ఉద్ధేశించి ఇష్టాగోష్టిగా మాట్లాడుతారు.

అక్కడి రోనాల్డ్ రీగన్ బిల్డింగ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్‌లో ఈ కార్యక్రమం ఉంటుంది. ముందస్తు స్వాగతంగా వాషింగ్టన్ డిసిలో ఆదివారం వందలాది మంది భారతీయులు జాతీయ స్మారకస్థూపం వద్ద గుమికూడారు. ఆహ్లాదకరమైన ఆదివారపు ఎండపొడల మధ్య వారు ఉత్సాహంగా కన్పించారు. ప్రధాని మోడీ రాకకోసం తామంతా ఎదురుచూస్తామని తెలిపారు. పలుచోట్ల మోడీమోడీ నినాదాలు వెలువడ్డాయి. హుస్టన్‌లో ప్రతీకాత్మకమైన సుగర్‌లాండ్ మొమోరియల్ పార్క్ వద్ద భారతీయ సామాజానికి చెందిన వారు మోడీ ప్లకార్డులతో నిలిచారు. భారత జాతీయ మువన్నెల జెండాలతో ఇదే సమయంలో బోస్టన్, చికాగో, అట్లాంటా, డల్లాస్, టంపా, లాస్‌ఏంజిల్స్ వంటి పలు ప్రధాన నగరాలలో మోడీ రాకపట్ల ఉత్సాహం వెల్లువెత్తింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News