Thursday, October 10, 2024

మెట్‌లైఫ్‌ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2024 ప్రపంచ రికార్డ్‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ స్టేడియంలో8వ ఎడిషన్ పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్ (జేబీసీ) గ్రాండ్‌ ఫినాలేకు చేరుకుని, దేశంలోని యువ బ్యాడ్మింటన్‌ ప్రతిభావంతులు సాధించిన విజయాలను వేడుక చేసుకుంటోంది. వరుసగా మూడవ ఏడాది “బహుళ నగరాలలో అత్యధిక చిన్నారులు పాల్గొనే బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌”గా ఈ ఈవెంట్‌ చారిత్రక మైలురాయిగా నిలిచిపోనుంది. వరల్డ్‌ రికార్డ్‌ సర్టిఫికేషన్‌ ఏజెన్సీ (డబ్ల్యూఆర్‌సీఏ) ద్వారా వరుసగా మూడు సంవత్సరాలు ప్రపంచ రికార్డును మంజూరు చేయబడడం ద్వారా, జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ప్రపంచంలో ఈ ఛాంపియన్‌షిప్‌కు ఉన్న ప్రాముఖ్యతను చాటుతోంది.

ముగింపు సంరంభానికి ఏషియన్‌ గేమ్స్‌ స్వర్ణ పతక విజేత మరియు జేబీసీ మెంటార్‌లు అయిన చిరాగ్‌ షెట్టి, సాత్విక్‌ రాంకిరెడ్డిలతో పాటుగా, చిరాగ్ శెట్టి & సాత్విక్ రాంకిరెడ్డి, ముఖ్య అతిథి వెంకట్ చంగవల్లి, సీఈఓ ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా, సమీర్ బన్సల్, సీఈఓ & ఎం. డి , పీఎన్‌బీ మెట్‌లైఫ్ & సౌరభ్ లోహ్టియా, సి ఎం సి ఓ , పీఎన్‌బీ మెట్‌లైఫ్ లు ప్రాతినిధ్యం వహించారు. విజేతలుగా నిలిచిన యువ అథ్లెట్‌లకు, వారి అసామాన్యమైన విజయానికి గుర్తుగా ప్రతిష్టాత్మక జేబీసీ ట్రోఫీని అందజేశారు. ఈ ఈవెంట్‌లో చిరాగ్, సాత్విక్‌లతో ప్రత్యేక మెంటారింగ్ సెషన్‌ను నిర్వహించగా, వాళ్లు దానిలో గేమ్‌ప్లే, క్రీడలతో విద్యాభ్యాసంపై సమతుల్యం పాటించడం, ఒత్తిడిని నిర్వహించడం, అలాగే మానసిక ధృడత్వాన్ని నిర్మించుకోవడంపై యువ షట్లర్లు మరియు వారి తల్లిదండ్రులతో అనేక విలువైన అంతర్గత అంశాలను పంచుకున్నారు.

టోర్నమెంట్ విజయం సాధించడం పట్ల పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ ఎండీ మరియు సీఈఓ అయిన మి. సమీర్‌ బన్సల్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. “పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో మరో విజయవంతమైన ఎడిషన్‌ను పూర్తి చేసుకోనుండడంతో, వరుసగా మూడవ ఏడాది సాధించిన ప్రపంచ రికార్డును మాత్రమే కాకుండా, దేశం నలుమూలల నుండి అద్భుతమైన ప్రతిభ ఉద్భవించడాన్ని కూడా మేము వేడుక చేసుకుంటున్నాము. ఈ విజయం యువ అథ్లెట్లకు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి, అలాగే వారు రాణించడం కోసం మెరుగైన అవకాశాలను అందించడం పట్ల ప్రాముఖ్యతను చాటి చెబుతోంది. విజేతలు అందరికీ, అలాగే వారి కుటుంబాలు మరియు కోచ్‌లకు అభినందనలు. పీఎన్‌బీ మెట్‌లైఫ్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం కోసం, అలాగే పిల్లల మానసిక, శారీరక సామర్థ్యాల సమగ్ర అభివృద్ధికి మద్దతును అందించే విషయంలో క్రీడలకు ఉన్న అపారమైన శక్తిని మేము విశ్వసిస్తున్నాము. వర్ధమాన ప్రతిభను పెంపొందించడంలో, ఇంకా భవిష్యత్ సవాళ్లకు వారిని సిద్ధం చేయడంలో జేబీసీ ఒక ముఖ్యమైన వేదికగా కొనసాగుతుంది,” అని ఆయన అన్నారు.

ఏషియన్‌ గేమ్స్‌ బంగారు పతక విజేత మరియు జేబీసీ 2024 మెంటార్ అయిన సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి తన ఆనందాన్ని వెల్లడిస్తూ, “ఈ ఏడాది జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న యువకుల అద్భుతమైన ప్రతిభ, ఉత్సాహాన్ని చూడటం ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. వారికి ఉన్న అంకితభావం, స్ఫూర్తి అట్టడుగు స్థాయి వరకు క్రీడలను ప్రోత్సహించడంలో ఉన్న ప్రాముఖ్యతను మనకు గుర్తు చేస్తుంది,” అని అన్నారు.

సాత్విక్‌సాయిరాజ్‌కు డబుల్స్‌ పార్ట్‌నర్‌ మరియు జేబీసి 2024కు తోటి మెంటార్ అయిన చిరాగ్‌ షెట్టి మాట్లాడుతూ, “పీఎన్‌బీ మెట్‌లైఫ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 8వ ఎడిషన్‌లో యువ ఆటగాళ్లు ప్రదర్శించిన శక్తి, నైపుణ్యాల గురించి చెప్పేందుకు అద్భుతం అనడం కంటే తక్కువ కాదు. ఈ ఈవెంట్ ఔత్సాహిక బ్యాడ్మింటన్ స్టార్‌లను వెలుగులోకి తీసుకొచ్చే దీపస్తంభంగా అవతరించింది, అలాగే వరుసగా మూడవ ఏడాది తన స్వంత ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడం అనేది ఈ ఈవెంట్‌కు పెరుగుతున్న ఆదరణ, ప్రభావాలకు నిదర్శనం. మెంటార్‌లుగా, సాత్విక్ ఇంకా నేను… జేబీసీ చేపట్టిన ఈ కార్యక్రమంతో అనుబంధం కలిగి ఉన్నందుకు ఎంతగానో గర్వపడుతున్నాము, ఇది మన వర్ధమాన అథ్లెట్‌లకు బ్యాడ్మింటన్‌లో మెరుపులు చూపించడానికి, అలాగే రాణించడానికి అవకాశం ఇస్తుంది,” అని అన్నారు.

ఆన్‌లైన్‌ బ్యాడ్మింటన్ అకాడమీ అయిన జేబీసీ బూట్‌ క్యాంప్ వంటి కార్యక్రమాలు, ప్రఖ్యాత కోచ్‌లు మరియు ప్లేయర్‌లు రూపొందించిన ట్యుటోరియల్‌ వీడియోలను అందిస్తాయి. యూ. విమల్‌ కుమార్, విజయ్ లాన్సీ, అనూప్‌ శ్రీధర్, మరియు జేబీసీ మెంటార్‌లు అయిన సాత్విక్, చిరాగ్‌ల వంటి ఎక్స్‌పర్ట్‌ల సారధ్యం, ప్రాతినిధ్యాలతో ఈ ట్యుటోరియల్‌లు బ్యాడ్మింటన్‌ టెక్నిక్‌లు, మానసిక సామర్థ్యం, ధారుడ్యం…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News