Wednesday, August 6, 2025

పోచారం ప్రాజెక్టు నీటి విడుదల…

- Advertisement -
- Advertisement -

ఆనంద ఉత్సాహంలో ఆయకట్ట రైతులు…

కామారెడ్డి: ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల రైతులకు వర ప్రసాదిని అయినా పోచారం ప్రాజెక్టు నీటిని బుధవారం మధ్యాహ్నం ప్రాజెక్టు ప్రధాన కాలువ గేట్లను ఎత్తి కాలువ గుండా సాగునీటిని విడుదల చేశారు. సోమవారం ప్రజావాణిలో ప్రాజెక్టు కింది ఆయకట్టు రైతు ప్రతినిధులు కొందరు పోచారం ప్రాజెక్టు నీటిని విడుదల చేయాలని, కురిసిన వర్షాలకు వర్షాధారంతో వేసిన వరి నాట్ల పంటలు ఎండిపోతున్నాయని, ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కామాల వారు ప్రాజెక్టులో కరెంటు మోటార్ ద్వారా నీటిని తోడేస్తున్నారని, ఆయకట్ట కింది రైతుల పంట పొలాలు ఎండిపోతుంటే ప్రాజెక్టు నీటిని ఎప్పుడు విడుదల చేస్తారని ఎదురు చూస్తున్నారు. వెంటనే ప్రాజెక్టు నీటిని విడుదల చేయకుంటే ఆందోళనకు దిగుతామని ప్రజావాణిలో రైతులు ఇచ్చిన ఫిర్యాదుకు అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టి జిల్లా అధికారుల అనుమతితో బుధవారం నీటిని విడుదల చేశారు.

ఎల్లారెడ్డి ఆర్ డి ఓ పార్థసారథి రెడ్డి, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి మల్లేష్, ఎల్లారెడ్డి ఎఎంసి చైర్మన్ రజిత వెంకట్రాంరెడ్డి, ఇరిగేషన్ డి ఈ వెంకటేశ్వర్లు, నాగిరెడ్డిపేట్ తాసిల్దార్ శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఎఇ అక్షయ్, ఆ శాఖల అధికారులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్, నాయకులు రామచంద్రారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయకట్ట కింది ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News