Thursday, May 2, 2024

ఇంకో ఐదేళ్లయినా పోలవరం పూర్తికాదు

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/చిన్నకోడూరు: పొరుగున ఉన్న ఎపిలో పోలవరం ప్రాజెక్ట్ మొదలై దశాబ్ధకాలం అయినా ఇప్పటికీ పూర్తి కాలేదు.. అది పూర్తి కావడానికి మరో ఐదేళ్లైనా పట్టొచ్చు.. మన రాష్ట్రంలో 4 ఏళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేశాం అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పే ర్కొన్నారు. కాళేశ్వరం కన్నా ముందు మొదలైన పోలవరం ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాలేదు.. ఇదే విషయాన్ని అక్కడి ఇంజినీరొకాయనతో మాట్లాడితే.. పోలవరం పూర్తికావడానికి మరో ఐదేళ్లైనా పట్టే అవకాశం ఉందని చెప్పాడని మంత్రి అన్నా రు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి, దాని ఫలితాలను తెలంగాణ సమాజం అనుభవిస్తుందన్నారు. దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో నీటిపారుదల రంగానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏ స్థాయిలో ప్రాధాన్యం ఇస్తుందో అర్థమవుతుందన్నారు. “కాళేశ్వరం ద్వా రా ఒక్క ఎకరం కూడా పండలేదని కొంతమంది మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్లు నా ముందుం టే చెంప చెల్లు మనిపించే వాడిని” అని మంత్రి తీవ్రస్థాయిలో అన్నారు.

ఆదివారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూత న పాలకవర్గం ప్రమాణ స్వీకారంలో పాల్గొని మం త్రి మాట్లాడారు. ఢిల్లీలో, గాంధీభవన్‌లో కూర్చుని మాట్లాడితే ఏం తెలుస్తుంది.. గ్రామాల్లోకి వచ్చి చూస్తే తెలుస్తుందన్నారు. గ్రామంలో నాయకులు చర్చ పెట్టి ఇతర పార్టీ నాయకులు మాట్లాడకుండా చెంప చెల్లుమనిపించాలని హరీశ్ కార్యకర్తలకు సూచించారు. ప్రతి గ్రామంలో బావులు, చెరువులు నిండుకుండలా ఉన్నాయన్నారు. గతంలో ఇక్కడ 5వేల ఎకరాల్లో కూడా పంటలు పండేవి కావు.. కానీ, ఇప్పుడు చిన్నకోడూర్ మండలంలోనే 20వేల ఎకరాల్లో పంటలు పండుతున్నాయన్నారు. బిజెపి నాయకులు తెలంగాణ రైతులను నూకలు తినమని అవమానపరిచారు. కానీ, సిఎం కెసిఆర్ ప్రతి గింజను కొనుగోలు చేశారన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చి నల్లచట్టాలు తెచ్చి పెట్రలో, డీజల్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచిందన్నారు.

సిఎం కెసిఆర్ రైతులకు బోరు బావుల కోసం రూ.18,500 కరెంట్ బిల్లు కట్టి ఉచితంగా విద్యుత్ ఇస్తున్నారన్నారు. బోర్ బావుల వద్ద మీటర్లు పెట్టాలని కేంద్రం కొర్రి పెట్టి తెలంగాణ ప్రభుత్వానికిచ్చే రూ.30వేల కోట్ల నిధులు నిలిపివేసిందన్నారు. తెలంగాణలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయని ఆ డబ్బుతో మన ప్రాంత ప్రజలు ఇతర రాష్ట్రాల్లో భూములు కొంటున్నారన్నారు.

కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ కొండం వనిత రవీందర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, ఎంపిపిలు కూర మాణిక్యరెడ్డి, ఉగ్గు బాలకృష్ణ యాదవ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, జిల్లా సమితి సభ్యులు మేడికాయల వెంకటేశం, జిల్లా అధ్యక్షుడు శ్రీహరి యాదవ్, మార్కెట్ కమిటి ఉపాధ్యక్షుడు ములకల కుంటయ్య, జిల్లా డైరెక్టర్ నముండ్ల రామచంద్రం, పార్టీ అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, సోసైటీ చైర్మన్లు బొగిగే సదానందం గౌడ్, ములకల కనకరాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News