Tuesday, April 30, 2024

సుప్రీం ఆదేశాల మేరకు రెజ్లర్లకు పోలీస్ భద్రత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: డబ్లూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్‌భూషన్ శరణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణలు చేసిన ఏడుగురు మహిళా రెజ్లర్లకు పోలీసులు భద్రత కల్పించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు భద్రతను పొడిగించారు. డబ్లూఎఫ్‌ఐ చీఫ్, బిజెపి ఎంపి సింగ్‌పై ఎఫ్‌ఐఆర్‌లు నమోదైన రెండురోజుల అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈనేపథ్యంలో ఒలింపిక్ పతక విజేత, విచారణ కమిటీలో సభ్యుడైన రెజ్లర్ యోగేశ్వర్‌దత్ మాట్లాడుతూ రెజ్లర్లు తమ క్రీడపై దృష్టి సారించాలని కోరారు. బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనందున ఇకపై క్రీడకు ప్రాధాన్యమివ్వాలన్నారు. పోలీసులుకు ఫిర్యాదు చేసినప్పుడే వారు చర్యలు తీసుకుంటారు.

రెజ్లర్లు మూడు నెలల క్రితమే ఈ పని చేయాల్సింది. చర్యలు తీసుకోవాలంటే ఫిర్యాదు చేయాలని ఇంతకుముందు కూడా చెప్పాను అని దత్ అన్నారు. కాగా రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు రాజకీయపార్టీలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. ఆదివారం భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ రెజ్లర్లకు సంఘీభావం తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ నేతప్రియాంకగాంధీ భర్త రాబర్ట్ వాద్రా మంతర్ చేరుకుని రెజ్లర్లుకు మద్దతు తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం రెజ్లర్లుకు మద్దతు తెలుపుతూ మహిళలను వేధించేవారిని ఉరి తీయాలన్నారు. డబ్లూఎఫ్‌ఐ చీఫ్ సింగ్‌ను అరెస్టు చేసేవరకూ తమ ఆందోళన కొనసాగుతోందని సాక్షిమాలిక్, బజరంగ్ పూనియాతో కూడినరెజ్లర్లు బృందం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News