Sunday, April 28, 2024

కాలుష్య రహిత తెలంగాణే లక్షం

- Advertisement -
- Advertisement -

జమ్మికుంట : భావితరాలకు స్వచ్ఛమైన కాలుష్య రహిత తెలంగాణాను అందించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లక్షం అని మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు అన్నారు. సోమవారం మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా మాచనపల్లికి వెళ్ళె ప్రధాన రహదారి(నాయిని చెరువులో)హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లారని, అధేవిధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు నిర్విరామం గా కొనసాగిస్తున్నారని కొనియాడారు. అందులో భాగంగానే హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విషయా న్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. మొక్కలు విరివిగా నాటాలని దీంతో సంవృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

హరితహారం కార్యక్రమం తెలంగాణాకే మణిహారం అని అన్నారు. దీంతో భావితరాలకు స్వచ్ఛమైన, కాలుష్య రహిత తెలంగాణ సమాజంను అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్షం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ దేశిని స్వప్నకో టి, కమీషనర్ బి.శ్రీనివాస్, అటవీశాఖ అధికారులు, కౌన్సిలర్లు, హరితహారం సిబ్బంది, ఆర్‌పిలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News