Sunday, September 15, 2024

2036 నాటికి 152.2 కోట్లకు చేరనున్న జనాభా

- Advertisement -
- Advertisement -

లింగ నిష్పత్తి కూడా 952కు మెరుగుపడనున్నది!

న్యూఢిల్లీ: భారత జనాభా 2036 నాటికి 152.2 కోట్లకు పెరుగనున్నది. అంతేకాదు మహిళల జనాభా శాతం కూడా కాస్త మెరుగుపడనున్నది. 2011లో 48.5 శాతం ఉండగా అది 48.8 శాతానికి పెరుగనున్నది. ఈ విషయాన్ని గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (MoSPI) సోమవారం తెలిపింది.

‘విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023’ నివేదిక 15 ఏళ్ల లోపు ఉన్న లింగ నిష్పత్తి తేడా చాలా వరకు తగ్గిపోనుందని పేర్కొంది. ఫెర్టిలిటీ రేట్ కూడా పడిపోయే అవకాశం ఉందని రిపోర్టు పేర్కొంది. కాగా 60 ఏళ్ల కన్నా ఎక్కువ ఉండేవారి జనాభా పెరుగనున్నట్లు రిపోర్టు తెలిపింది. 2036 నాటికి ప్రతి 1000 మంది పురుషులకు 943 మంది మహిళలు ఉండనున్నారని ప్రొజెక్ట్ చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News