Friday, May 3, 2024

ఎఫ్‌డి కంటే ఎక్కువ వడ్డీ రేటు కావాలా?

- Advertisement -
- Advertisement -

పోస్టాఫీస్ నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ ఖాతా ఉత్తమం
న్యూఢిల్లీ : యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా (బిఒఐ), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌తో సహా అనేక బ్యాంకులు ఇటీవల ఫిక్స్‌డ్ డిపాజిట్ల(ఎఫ్‌డి) వడ్డీ రేట్లను మార్చాయి. ఈ బ్యాంకులలో లేదా మరేదైనా బ్యాంకులో ఎఫ్‌డి చేయడానికి ప్లాన్ చేయాలనుకుంటే గనుక ముందు పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ ఖాతా వడ్డీ రేట్ల గురించి ముందుగా తెలుసుకోండి. ఈ పథకం గరిష్టంగా 7.5 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. దేశంలోని ప్రధాన బ్యాంకుల్లో ఎఫ్‌డిపై లభించే వడ్డీ కంటే ఇది ఎక్కువగా ఉంటుంది. ఈ బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి), టైమ్ డిపాజిట్ ఖాతాల కొత్త వడ్డీ రేట్ల గురించి తెలుసుకోండి. తద్వారా సరైన వాటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఎక్కువ లాభాలను పొందవచ్చు.

7.5% వరకు వడ్డీ
నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ ఖాతాలో 7.5% వరకు వడ్డీ లభిస్తుంది. ఇది ఒక రకమైన ఎఫ్‌డి లాంటిది. నిర్ణీత వ్యవధిలో దీనిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా స్థిరమైన రాబడిని పొందవచ్చు. టైమ్ డిపాజిట్ ఖాతాలు 1 నుండి 5 సంవత్సరాల వరకు 6.9% నుండి 7.5% వరకు వడ్డీ రేట్లను అందిస్తాయి. దీనిలో కనీసం రూ.1000 పెట్టుబడి పెట్టాలి. గరిష్ట పెట్టుబడిపై పరిమితి లేదు. 5 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేయడంపై పన్ను మినహాయింపు ప్రయోజనం పొందుతారు. టైమ్ డిపాజిట్ స్కీమ్, ఎఫ్‌డిలో 5 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందవచ్చు. దీని కింద రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడిపై ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది.

ఎక్కడ పెట్టుబడి పెట్టాలి?
మీరు తక్కువ వ్యవధిలో అంటే 1, 2 లేదా 3 సంవత్సరాలకు ఎఫ్‌డిని పొందాలనుకుంటే యాక్సిస్ లేదా ఇండస్ బ్యాంక్‌లో మంచిది. ఎందుకంటే ఇందులో టైమ్ డిపాజిట్ కంటే ఈ కాలానికి చెందిన ఎఫ్‌డీకి ఎక్కువ వడ్డీ లభిస్తోంది. మీరు 5 సంవత్సరాల పాటు ఎఫ్‌డి పొందాలనుకుంటే, టైమ్ డిపాజిట్ పథకం సరైనది. ఎందుకంటే ఇతర బ్యాంకుల కంటే ఎక్కువగా 7.50 శాతం వార్షిక వడ్డీ ఇస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News