Sunday, April 28, 2024

ఇక ఇంటికే పోస్టల్ సేవలు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో అందుబాటులోకి క్లిక్ ఎన్ బుక్ సేవలు

మన తెలంగాణ / హైదరాబాద్ : పోస్టల్ సేవలు మరింత సులభతరం అయ్యాయి. పోస్టాఫీసుకు వెళ్ళకుండానే ఇంటి నుండే సేవలు పొందే వెసులు బాటు హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. పార్సిళ్లు పోస్ట్స్ చేయాలంటే ఇక పోస్ట్ ఆఫీస్‌కు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇంటి నుండే వీటిని పంపించవచ్చు. హైదరాబాద్‌లో ఇప్పుడు ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. భారతీయ తపాలా శాఖ ’క్లిక్ ఎన్ బుక్’ పేరుతో కొత్తగా ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆన్‌లైన్ సేవల ద్వారా ఇకపై ఇంటి నుంచే స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ లెటర్స్ సహా పార్సిళ్ళు పంపించడానికి వీలవుతుంది. ఆధునాతన సాంకేతికతను తపాలా శాక ఉపయోగించుకుంటోంది.

దీని ద్వారా కస్టమర్ ఫ్రెండ్లీగా, హై-టెక్ సర్వీసులను అందించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ’క్లిక్ ఎన్ బుక్’ సర్వీసును హైదరాబాద్ నగర వాసులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ’క్లిక్ ఎన్ బుక్’ సర్వీస్ ఉత్తర ప్రదేశ్, ప్రయాగ్ రాజ్ జిల్లాలోని ప్రయాగ్ రాజ్, కచ్చరీ హెడ్ పోస్ట్ ఆఫీసుల్లో మాత్రమే అందుబాటులోకి రాగా తాజాగా హైదరాబాద్‌లోని పోస్టాఫీసుల్లోనూ అందుబాటులోకి తెచ్చారు. పోస్టు ఆఫీసుకు వెళ్లకుండానే గరిష్టంగా 5 కెజీల బరువు వరకు స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్, పార్సిల్స్‌ను పంపించుకోవచ్చు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలనుకుంటే ముందుగా పోస్టల్ విభాగం అధికారిక వెబ్‌సైట్ www.indiapost.gov.in వ్బ్సైట్ లో వ్యక్తిగత వివరాలను నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలు నమోదు చేసిన వెంటనే ఒక యూజర్ ఐడీ, పాస్వర్డ్ జనరేట్ అవుతాయి. ఈ యూజర్ ఐడీ, పాస్వర్డ్ సహాయంతో www.indianpost.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి స్పీడ్ పోస్టు, రిజిస్టర్డ్ లెటర్స్, పార్సిల్స్ పంపించుకోవచ్చు. ఇలా ఇంటి నుంచే ఒకసారికి గరిష్ఠంగా 5 లెటర్లు పంపించుకోవచ్చు. అయితే వీటి బరువు 5 కేజీల లోపు మాత్రమే ఉండాలి.

వినియోగదారులు రూ.500 వరకు బుకింగ్ ఛార్జీలు చెల్లిస్తే.. పోస్టల్ విభాగం మీ పోస్టులను, లేదా పార్సిల్స్ ను పూర్తి ఉచితంగా పికప్ చేసుకుంటారు. ఒక వేళ మీరు చెల్లించిన బుకింగ్ ఛార్జీలు రూ.500 కంటే తక్కువగా ఉంటే రూ.50 వరకు పికప్ ఛార్జీల కింద వసూలు చేస్తారు. ఆదివారం, ప్రభుత్వ సెలవు దినాల్లో కాకుండా ప్రతి రోజు ఉదయం 9.30 గంటలలోపు బుకింగ్ చేసుకుంటే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోపు పికప్ చేసుకుంటారు. ఉదయం తొమ్మిదిన్నర గంటల తరువాత బుకింగ్ చేసుకుంటే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4 గంటలలోపు పికప్ చేసుకుంటారు. ఒకవేళ మధ్యాహ్నం 12.30 గంటల తరువాత బుకింగ్ చేసుకుంటే పోస్టల్ సిబ్బంది మరుసటి రోజు పికప్ చేసుకుంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News