- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చాకిచెర్ల శివారులో వ్యాన్ ను లారీ ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మెరుగైన వైద్యం కోసం వారిని నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు పిడుగురాళ్ల నుంచి తిరుమలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో పిడుగురాళ్లలో విషాదచాయలు అలుముకున్నాయి.
- Advertisement -