Thursday, May 2, 2024

బంగారం ధరలు పైపైకి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బంగారం ధరలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. అక్షయ తృతీయ వేళ పసిడి, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. తాజాగా.. బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. శనివారం (ఏప్రిల్‌ 15) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.56,650 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,800 గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.550, 24 క్యారెట్లపై రూ.600 మేర పెరిగింది. కాగా, కిలో వెండి ధర రూ.1600 మేర పెరిగి రూ.79,600 గా కొనసాగుతోంది.

Also read: భూదేవి కాంప్లెక్స్ లో దివ్యదర్శనం టోకెన్లు జారీ

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,800 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,650 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,800 విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,800 లుగా కొనసాగుతోంది.

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.83,000
విజయవాడలో రూ.83,000
విశాఖపట్నంలో రూ.83,000 లుగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News