Wednesday, May 1, 2024

రూ.72,000 దాటింది..

- Advertisement -
- Advertisement -

రికార్డు స్థాయికి బంగారం
 వరుసగా మూడో రోజు పెరిగిన ధర

ముంబై : బంగారం, వెండి ధరలు వరుసగా మూడో రోజు పెరిగి, జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధర 10 గ్రాములు రూ.72,000 లను తాకింది. దేశీయంగా డిమాండ్, విదేశీ మార్కెట్లలో కొనుగోళ్లు వెరసి బంగారం రేటు పరుగులు పెడుతోంది. బుధవారం నాడు ఢిల్లీలో బంగారం 10 గ్రాములు ధర రూ.160 పెరిగి రూ.72 వేలు దాటింది. మంగళవారం ఇది రూ.71,840 వద్ద ఉంది. ఇక వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి.

కిలో వెండి ధర రూ.200 పెరిగి రికార్డు స్థాయి రూ.84.700 వద్దకు చేరుకుంది. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ మాట్లాడుతూ, ఢిల్లీ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధరలు (24 క్యారెట్లు) 10 గ్రాములు రూ.160 పెరిగి రూ.72,000 వద్ద ట్రేడ్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 6 డాలర్లు పెరిగి 2.356 డాలర్లకు చేరుకుంది. మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ కమోడిటీ రిసెర్చ్ సీనియర్ విపి నవనీత్ దమానీ మాట్లాడుతూ, బంగారం, వెండి ధరలు ఆల్‌టైమ్ హైకి చేరుకున్నాయని, అయితే అమెరికాలో ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లపై ఆందోళనలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారంలో పెట్టుబడి సురక్షితమైనదిగా భావించి కొనుగోళ్లు జరుపుతున్నారని అన్నారు.

రూ.75 వేల వరకు పెరగొచ్చు..
రానున్న రోజుల్లో బంగారం ధరలు పెరిగే అవకా శం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ ఏడాది చివరి నాటికి 10 గ్రా ముల బంగారం ధర రూ.75 వేలకు చేరొచ్చు. అ దే సమయంలో వెండి కూడా కిలో రూ.85 వేలకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు నష్టాలను కవర్ చే యాలనుకోవడం, యుద్ధం భయాల కారణంగా బంగారం కొనుగోలు చేస్తున్నారు. వడ్డీ రేటు త గ్గింపు తర్వాత డాలర్ బలహీనతపై భయాలు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా వెండి సరఫరా తక్కువ గా ఉంది, అయితే డిమాండ్ పెరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News