Wednesday, May 8, 2024

టీకా ఉత్సవ్ అన్నారు.. వ్యాక్సిన్లు అందించలేకపోయారు

- Advertisement -
- Advertisement -

Priyanka Gandhi criticized centre govt on Tika Utsav

ప్రియాంకాగాంధీ

న్యూఢిల్లీ: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏప్రిల్ నెలలో టీకా ఉత్సవ్ జరిపింది. కానీ, వ్యాక్సిన్లు ప్రజలకు అందేలా ఏర్పాట్లు చేయలేకపోయిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ విమర్శించారు. గత 30 రోజుల్లో దేశంలో వ్యాక్సినేషన్ 82 శాతం పడిపోయిందంటూ తెలిపే గ్రాఫిక్స్‌ను ట్విట్టర్ ద్వారా ఆమె షేర్ చేశారు. దేశంలో వ్యాక్సినేషన్‌ను విస్తృతపరిచే లక్షంతో కేంద్రం ఏప్రిల్ 11నుంచి 14 వరకు టీకా ఉత్సవ్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అత్యధిక సంఖ్యలో వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసే దేశంలో ఈ దుస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు. పౌరులకు వ్యాక్సిన్ డోసులు ఇవ్వడంలో అమెరికా,యుకె,టర్కీ, ఫ్రాన్స్‌కన్నా భారత్ వెనకబడి ఉన్నదని ఆమె తెలిపారు. అందరికీ వ్యాక్సిన్లు ఇవ్వడం ద్వారానే కరోనాపై పోరాటంలో విజయం సాధిస్తామని ఆమె అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News